తెలంగాణ

telangana

ETV Bharat / state

మేనమామ అనుకుంటే మానవ మృగమయ్యాడు - తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారం - MINOR GIRL RAPE IN EAST GODAVARI

మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి అత్యాచారం - ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన - తండ్రి ఫిర్యాదుతో పోక్సో కోసు నమోదు

Minor Girl Was Raped by Her Uncle
Minor Girl Was Raped by Her Uncle (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 8:01 AM IST

Minor Girl Was Raped by Her Uncle :మేనమామగా భావించిన దగ్గరి బంధువే మానవమృగమై అభంశుభం తెలియని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లిదండ్రుల ఆలనాపాలన లేదని, అమ్మమ్మ దగ్గర ఉంటుందని తెలిసి బాలికను నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడెేపల్లి మండలానికి చెందిన బాలిక నిడదవోలు మండలంలోని ఓ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్​లో ఉండగా, తండ్రి వేరుగా ఉంటున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ఉంటున్న బాలిక అమ్మమ్మ ఆమె బాగోగులు చూస్తున్నారు.

ఆ పనినే ఆసరాగా చేసుకుని : బాలికకు వరుసకు మేనమామైన కమల్​ తాడేపల్లిగూడెం మండలంలోనే ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు బాలిక ఇంటి దగ్గరకు వచ్చేవాడు. బాలిక ఆధార్ ​కార్డులో మార్పులు చేయాల్సి రావడంతో ఈ నెల 14న ఆమె అమ్మమ్మ కమల్​కు రూ.100 ఇచ్చి పంపించి ఆధార్ కార్డు పని చేయాల్సిందిగా కోరింది. దాన్నే ఆసరాగా తీసుకున్నాడు కమల్. దీంతో ఆయన వసతి గృహానికి చేరుకుని బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని చాగల్లు మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలికను తాడేపల్లిగూడెం మండలంలోని ఆమె అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు.

నిందితునిపై పోక్సో కేసు నమోదు : బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో అమ్మమ్మ ఏం జరిగిందని అడగ్గా, కమల్ చేసిందంతా వివరించింది. బాలికను నమ్మించి ఆధార్ పని మీద అతనితో ఇచ్చి పంపించడమే తప్పైంది అంటూ బాలిక అమ్మమ్మ విలపించింది. దీంతో బాలికను నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమల్​పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details