AP Ministers Meeting on Ganja and Drug Control:రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్సును ఇక నుంచి ఈగల్ అనే పేరుతో వ్యవహరించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రుల కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్, వైద్యోరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించారు.
గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని వెల్లడించింది. నినాదాలు, ప్రతిజ్ఞలతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలియచేసింది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని యువతను భాగస్వామ్యం చేసి పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రుల కమిటీ పేర్కోంది. సమాచార శాఖతో పాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రచారం కల్పించి పక్షాళన చేపడతామని వెల్లడించింది.
పీడీఎఫ్ రైస్ అక్రమంగా ఎగుమతి - సముద్రంలోకి వెళ్లి తనిఖీలు చేసిన కలెక్టర్