Vangalapudi Anitha gets Ministry of Home Affairs : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. బుధవారం చంద్రబాబుతో పాటుగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి చంద్రబాబు మంత్రిపదవులు కేటాయించారు. ఈ క్రమంలోనే పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది.
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్? - AP TDP NEW STATE PRESIDENT
పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకి పట్టం :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయత వల్ల చంద్రబాబు ఆమెకు మంత్రి పదవిని కేటాయించారు. ఏకంగా హోంమంత్రిని చేశారు.
అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డులు బ్రేక్ : ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా, హోం మంత్రిగా నియమితులయ్యారు.
టీచర్ టూ - హోమ్ మినిస్టర్ : ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్ఠానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.
మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలు : రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని తెలిపారు.
పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదా - Pawan Kalyan Key Role in Cabinet
మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆ ఐదు హామీల అమలుకు తొలిరోజే గ్రీన్‌సిగ్నల్ - CM Chandrababu Signs Five Files