Minister Sethakka Allegations On KTR And Talasani : దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్, కేటీఆరే ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. అనుమతులిచ్చే సమయానికి ఇథనాల్ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయి ఉన్నారన్న ఆమె ఆ కంపెనీ మరో డైరెక్టర్‌గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారన్నారు. పుట్టా సుధాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకులని సీతక్క వెల్లడించారు. గతంలో గ్రామసభ నిర్వహించకుండానే అనుమతులిచ్చారన్న మంత్రి బీఆర్ఎస్ నాయకులు తప్పు చేసి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ దిలావర్‌పూర్ రావాలన్న సీతక్క కంపెనీకి అనుమతులు ఎవరిచ్చారనేది అక్కడే తేలుస్తామన్నారు.
"ఇథనాల్ కంపెనీకి 2022 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ఆనాటి బీఆర్ఎస్ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ధర్నాలు చేస్తుంటే దాన్ని నిస్సిగ్గుగా ఎక్స్‌లో పోస్టులు పెట్టి మమ్మల్ని(కాంగ్రెస్ ప్రభుత్వాన్ని) బద్నాం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని, అప్పటి సీఎం కేసీఆర్ సంతకాలను అన్నింటిని సమన్వయం చేసి పరిశ్రమకు సంపూర్ణమైన అనుమతులు ఇప్పించింది కేటీఆర్. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి ఆ కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయికిరణ్ ఉన్నారు. దాదాపు 10 మంది డైరెక్టర్లతో ఆ సంస్థ ఉంది. కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ కుమారుడు ఇందులో డైరెక్టర్. పుట్టా సుధాకర్, తలసాని వియ్యంకులు."- సీతక్క, మంత్రి