Minister Ponguleti on New Ration Cards Issuing : రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti) పేర్కొన్నారు. గత ప్రభుత్వం మరిచిపోయిన కొత్త రేషన్‌కార్డుల జారీని త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో రూ.5 కోట్ల వ్యయంతో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ "మీ అందరి దీవెనలతో శాసన సభ్యుడినయ్యాను. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, అది మీరు పెట్టిన భిక్షే. గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని అవమానాలు ఎదురైనా, వాటిని నిలదొక్కుకుని రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చారు. పదవులు, అధికారం శాశ్వతం కాదు మీ శీనన్నగా మీగుండెల్లో ఉంటాను అని" మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Minister Ponguleti Fires on BRS :గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో కొత్త రేషన్‌కార్డులను ఇవ్వలేదు, వాటి ఊసే మరిచిపోయిందని మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ, త్వరలో రేషన్‌కార్డులను జారీ చేస్తామని స్పష్టం(New Ration Cards Issuing) చేశారు. అప్పటి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు ఆశ కల్పించారు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల సంఖ్య మొత్తం కలిపి వందల్లో ఉందని మండిపడ్డారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ డబుల్‌బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు.
మేడిగడ్డ దేవాలయం అప్పుడే బొందలగడ్డ ఎందుకు అయిందో కేసీఆర్ చెప్పాలి : పొంగులేటి