తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను - చట్టం తన పని తాను చేస్తుంది : మంత్రి పొంగులేటి - MINISTER PONGULETI ON KTR

ఈ-కార్ రేసులో విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని మంత్రి పొంగులేటి ప్రకటన - చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందన్న మంత్రి - కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చ

Minister Ponguleti On KTR Over formula e race
Minister Ponguleti On KTR Over formula e race (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

Updated : 6 hours ago

Minister Ponguleti On KTR Over formula e race :ఈ-కార్‌ రేసు వ్యవహారంలో చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే అనుమతి లభించిందని, గవర్నర్‌ అనుమతి ఇస్తూ జారీ చేసిన దస్త్రాన్ని ఇవాళ రాత్రి, లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్​) ఏసీబీకి(అవినీతి నిరోధక శాఖ)కు పంపిస్తారని చెప్పారు. చట్టప్రకారం అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు.

కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను :కేబినెట్ భేటీ అనంతరం సమావేశం వివరాలనుమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు అందించారు. ఈ-కార్‌ రేసులో అవకతవకలపై విచారణకు గవర్నర్‌ అనుమతిపై కేబినెట్‌లో చర్చ జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో చర్చించామని వెల్లడించారు. కేటీఆర్‌ అరెస్టుపై తానేమి చెప్పలేనని. చట్టం తన పని తాను చేస్తుందని వివరించారు.

బాంబు తుస్సుమందని ఇటీవల బీఆర్ఎస్​ నేతలు వ్యాఖ్యానించారన్న పొంగులేటి అది తుస్సుమనేదైతే దిల్లీ చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీఆర్​ఎస్ సభ్యులు ఎమ్మెల్యేల్లా కాకుండా గూండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. మాట్లాడటానికి అంశం లేనందుకే ప్లకార్డులు, నినాదాలతో సభకు ఆటంకం కలిగించారని ఆక్షేపించారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్‌ బిల్లు ప్రవేశపెడతామని వివరించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని పొంగులేటి అన్నారు. ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నామని వివరించారు.

ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్​పై FIR​ నమోదుకు అనుమతి కోసం గవర్నర్​కు లేఖ!

గవర్నర్‌ అనుమతి రాగానే ఈ-రేస్‌ స్కామ్​లో కేటీఆర్‌పై చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి

Last Updated : 6 hours ago

ABOUT THE AUTHOR

...view details