Minister Payyavula on AP Assembly Session: రేపు అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారంలో ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తరువాత మహిళా సభ్యులు అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. జగన్ సాధారణ సభ్యుల్లాగే బయటి నుంచి నడచుకుంటూ వస్తారని, సభ్యుల సీటింగ్ ఆంగ్ల అక్షరాల ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులందరూ ఒకే చోటే కూర్చుంటారని, ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని అన్నారు.
సందర్శకులకు ప్రవేశం లేదు: రేపు, ఎల్లుండి అసెంబ్లీలో సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యవుల కేశవ్ తెలిపారు. రేపు ఉదయం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కోసం కుటుంబసభ్యలతో సహా ఎవరికీ విజిటింగ్ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్‌లు రద్దు చేసినట్టు స్పష్టంచేశారు. రేపు ఉదయం 9.46 నిముషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంల ప్రమాణం చేయనున్నారు.
ఈ నెల 21నుంచి అసెంబ్లీ సమావేశాలు- స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు - Assembly Session Starts From June21