Minister Pawan on Mangrove Forest : ప్రపంచ మడ అడవుల సంరక్షణ దినోత్సవం వేళ అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మడ అడవులపై రూపొందించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. వీటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు తెలియజేయగా, పవన్ సవివరంగా తెలుసుకున్నారు.
Mada Forests in AP : ప్రకృతి విపత్తుల నుంచి మానవులను రక్షించేందుకు మడ అడవులే ముందు వరసలో ఉంటాయని మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వీటిని సంరంక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మడ అడవుల ప్రాంతంలో పారిశ్రామిక, ప్లాస్టిక్ వ్యర్థాలు కలవకుండా నిరోధించాలని ఆదేశించారు. వీటిని విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు వీటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
"తీరప్రాంత వైవిధ్యానికి మడ అడవులు ఎతో అవసరం. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను రక్షించడానికి ఇవి ఎంతో దోహదపడుతున్నాయి. ప్రజలకు వీటిపై అవగాహన లేక వీటిని నరికివేస్తున్నాం. ఇది ప్రకృతి అందించిన వరం. మడ అడవులు రక్షించాల్సి బాధ్యత మనందరిపై ఉంది." - పవన్ కల్యాణ్, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి