ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని అమరావతిపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు - Narayana About Capital Amaravati - NARAYANA ABOUT CAPITAL AMARAVATI

Minister Narayana Media Conference on Capital Development : రాష్ట్ర రాజధాని అమరావతిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. రాజధాని అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని తెలిపారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని నారాయణ స్పష్టం చేశారు.

Minister Narayana Media Conference on Capital Development
Minister Narayana Media Conference on Capital Development (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 7:40 PM IST

Minister Narayana Media Conference on Capital Development : అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. అలాగే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచాయని వివరించారు. రాజధాని అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని తెలిపారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.

మంత్రిగా వేగం పెంచిన లోకేష్ - విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం - Minister Nara Lokesh review meeting

రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది :వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని నారాయణ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి మూడు రాజధానులంటూ నానా రచ్చ చేశారని విమర్శించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపారు. రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు అందజేశారని గుర్తుచేశారు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారన్నారు. గతంలో రూ.48వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించాం. రూ.9వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించామని మంత్రి నారాయణ వివరించారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి :రాజధాని ప్రాంతంలో అనేక భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని వివరించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపిందని విమర్శించారు. చెత్తపన్నుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో 11 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని గుర్తుచేశారు. వాటిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

పాలనలో తన మార్క్, మార్పు చూపిస్తున్న సీఎం చంద్రబాబు - ప్రక్షాళన ప్రారంభం - Public Grievance Redressal

కూటమి ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటా : సీఎం చంద్రబాబు - Chandrababu teleconference

ABOUT THE AUTHOR

...view details