Minister Nara Lokesh Supporting To Another Qatar Gulf Victim :బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో దగాపడ్డ వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేశ్ తనదైన ముద్ర చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో పదుల సంఖ్యలో బాధితులను స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
చాలీచాలని ఆదాయాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేకేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.
తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్
తాజాగా ఉపాధి కోసం ఖతర్‌కు వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న శ్రీ సత్య సాయి జిల్లా కదిరికి చెందిన మరో మహిళ రషీదకు.. మంత్రి లోకేశ్ చొరవతో విముక్తి లభించింది. కదిరికి చెందిన రషీద గత నెలలో ఖతర్‌కు వెళ్లింది. అక్కడ పనిలో పెట్టుకున్న యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురిచేయటంతో తాళలేని స్థితికి గురైంది. దీంతో ఆమెను ఇంటికి పంపేయాలని విమాన టికెట్ ఛార్జీలను రెండుసార్లు పంపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా ఏజెంట్లు, పనిలో పెట్టుకున్న వారు స్పందించకుండా హింస పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ రషీద వాట్సాప్‌లో పంపిన వీడియోను కుటుంబ సభ్యులు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనికి స్పందించిన మంత్రి ఖతర్‌లోని అధికారులతో మాట్లాడి బాధితురాలిని స్వదేశంలోని స్వగ్రామానికి చేర్చేలా చర్యలు తీసుకున్నారు. దీంతో శనివారం రాత్రి విమానం ఎక్కిన ఆమె ఆదివారం తెల్లవారుజామున హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ నుంచి కదిరికి చేరుకున్నారు. మంత్రి లోకేశ్ చొరవ వల్లే తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నానని రషీద మరో వీడియో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
"చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ" - లోకేశ్ ఎమోషనల్ ట్వీట్
'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' - ఆరు నెలల పాలనపై చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే!