ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి రాలేననుకున్నా- లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర - Lokesh saved Virendra Kumar - LOKESH SAVED VIRENDRA KUMAR

Minister Nara Lokesh saved Virendra Kumar: మంత్రి నారా లోకేశ్ మరోసారి తన మంచిమనసు చాటుకున్నారు. ఉపాధి కోసం అని వెళ్లి వివిధ దేశాలలో చిక్కుకుని దుర్భర జీవితం గడుపుతున్న వారికి నేనున్నానంటూ భరోసా అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేసినా త్వరితగతిన స్పందిస్తూ, సమస్యను పరిష్కరిస్తున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో చిక్కుకుని దుర్భర జీవితం గడుపుతున్న వ్యక్తిని లోకేశ్ కాపాడారు.

Minister Nara Lokesh saved Virendra Kumar
Minister Nara Lokesh saved Virendra Kumar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 12:32 PM IST

Minister Nara Lokesh saved Virendra Kumar: సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో వ్యక్తిని మంత్రి లోకేశ్ కాపాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి వీరేంద్ర గల్ఫ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరేంద్ర కుమార్​కు కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. 16 నెలల క్రితం ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా వీరేంద్ర దుబాయ్ వెళ్లారు. దుబాయ్​లో మరో వ్యక్తికి వీరేంద్రను విక్రయించి హైదరాబాద్ ఏజెంట్ జారుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఎడారిలో చిక్కుకుని బాధితుడు నరకం చూశాడు. తనను రక్షించాలని ఏపీ మంత్రి లోకేశ్​ను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వేడుకున్నారు. మంత్రి లోకేశ్ చొరవతో బాధితుడు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తానని అనుకోలేదని బాధితుడు వీరేంద్ర తెలిపారు.

నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి వాసి వీరేంద్ర కుమార్ ఈనెల 19న ఎక్స్​లో పోస్ట్ చేశారు. ఖతర్​లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ఎడారిలో ఒంటెల మధ్య తనను పడేశారని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీరేంద్ర వీడియో పోస్ట్ చేయగా మంత్రి లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్​ఆర్​ఐ తెలుగుదేశం విభాగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో వీరేంద్రకు కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు స్వాగతం పలికారు. వీరేంద్రను చూసి ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ ఏజెంట్‌కు లక్షా 70 వేల రూపాయలు చెల్లించానని బాధితుడు వీరేంద్ర తెలిపారు. తనను దుబాయ్‌లో మరో ఏజెంట్​కు విక్రయించి జారుకున్నాడని తెలిపారు. తనను రక్షించిన మంత్రి లోకేశ్​కు, తెలుగుదేశం ఎన్నారై విభాగానికి జీవితాంతం రుణపడి ఉంటానంటూ వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఇక తిరిగి ఏపీకి రాలేమోనని అనుకున్నానని, మంత్రి లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చానంటూ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ తనకు అపాయింట్మెంట్ ఇచ్చి, జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు.

హామీ నిలబెట్టుకున్న నారా లోకేశ్​ - మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనూష - LOKESH PRAJA DARBAR 19th Day

Nara Lokesh Assured Woman Trapped in Oman:నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని లోకేశ్ స్వస్థలాలకు చేరుస్తున్నారు. తాజాగా నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమన్‌లో చిక్కుకున్న మామిడి దుర్గ అనే మహిళకు సైతం మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. బాధితురాలిని స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నానని తెలిపారు.

కేంద్రంతో మాట్లాడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్​ఆర్​ఐ విభాగానికి లోకేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. 4 నెలల క్రితం ఏజెంట్ల ద్వారా ఒమన్‌ దేశానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయానంటూ దుర్గ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై లోకేశ్ స్పందించి, ఆమెకు భరోసానిచ్చారు.

Lokesh Saved Telugu Worker Siva: ఇప్పటికే మంత్రి నారా లోకేశ్​ చొరవతో కువైట్ నుంచి తెలుగు కార్మికుడు శివ స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్​లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియోపై ఇటీవల లోకేశ్​ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడ్ని ఏపీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో కువైట్ నుంచి తెలుగు కార్మికుడు శివ కొద్ది రోజుల క్రితం స్వస్థలానికి చేరుకున్నాడు.

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటున్న నారా లోకేశ్ - ప్రజాదర్బార్‌కు పోటెత్తిన జనం - Minister Nara Lokesh Praja Darbar

ABOUT THE AUTHOR

...view details