Minister Nara Lokesh Reaction On Tirumala Laddu Issue :గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రపై పలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దీంతో వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వేంకటేశ్వర స్వామి అన్నదానం, అలాగే శ్రీ వారి లడ్డూ తయారీలో వాడే పదార్థాల నాణ్యత విషయం రాజీపడేదే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే టీటీడీ ఈవో తెలిపారు.
మంత్రి నారా లోకేష్ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మా అత్యంత పవిత్రమైన ఆలయం. వైఎస్సార్సీపీ నేతల హయాంలో తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ఉపయోగించారని తెలిసింది. కోట్లాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవించలేని వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి’’ అని మంత్రి ట్వీట్ చేశారు.
APCC Chief YS Sharmila Comments On Tirumala Laddu Controversy Over Chandrababu Statemen : లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజానిజాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.