Minister Nara Lokesh Prajadarbar program in Mangalagiri:ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం, దరిమడుగులో పేద రైతులకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ఆదిమూలపు సురేష్, అతని సోదరుడు ఆదిమూలపు సతీష్ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించారని బాధితులు ఆరోపించారు. విచారించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి, దర్శికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ మంత్రికి ఫిర్యాదు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1,800 మందికి వేతనాల పెంపుతో పాటు సర్వీస్‌తో కూడిన ఎఫ్టీఈని వర్తింపజేయాలని రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్(MGNREGS) అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు.
తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకుండా వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మధు పేరు చెప్పి బెదిరిస్తున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన సి.అమ్మాజీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్ 48వ రోజు ప్రజాదర్బార్‌కు మంగళగిరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి ఫిర్యాదులను పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.