ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోకేష్ ప్రజా దర్భార్​ అదుర్స్- అన్ని జిల్లాల్లో పెట్టండంటూ ప్రజల విజ్ఞప్తి - Nara Lokesh Praja darbar - NARA LOKESH PRAJA DARBAR

Minister Nara Lokesh Praja Darbar : ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణ కర్తవ్యంగా పరిష్కరించే దిశగా మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్​కు మంచి ప్రజాదరణ లభిస్తోంది. ఈ తరహా కార్యక్రమాలు ప్రతీ జిల్లాలోనూ నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

minister_nara_lokesh_praja_darbar
minister_nara_lokesh_praja_darbar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 12:53 PM IST

Updated : Jun 19, 2024, 4:37 PM IST

Minister Nara Lokesh Praja Darbar :మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రతీ జిల్లాలోనూ నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా లోకేష్ మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచీ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పోటెత్తారు. అందరి సమస్యల్ని లోకేష్‌ ఓపిగ్గా విని వారి నుంచి వినతులు తీసుకున్నారు. విశాఖలో ఎగ్జిబిషన్ గడువు రెన్యూవల్ కోసం అధికారులను గడువు కోరినా ఫలితం దక్కలేదని అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్​ని కలిస్తే గంటలో సమస్య తీరిపోయిందంటూ చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. పారా మెడికల్, ఆర్​ఎంపీ (RMP), కేజీబీవీ (KGBV) సంఘాల సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ తరహాలో జిల్లాల్లోని నేతలు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తే దూర ప్రాంతాల నుంచీ అమరావతి వచ్చే సమస్య ఉండదని ప్రజలు అభిప్రాయపడ్డారు.

అందరికీ అందుబాటులో, ప్రజాక్షేత్రంలో మంత్రి లోకేశ్- కొనసాగుతున్న ప్రజాదర్బార్ - Minister Nara Lokesh Praja Darbar

Nara Lokesh Congratulate Sports Women :న్యూజిలాండ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఓషియానిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన తెలుగుతేజం జెస్సీరాజ్‌కు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో విజయవాడకు చెందిన జెస్సీరాజ్‌, మొదటి స్థానంలో నిలవటంపై సామాజిక మాద్యమం ఎక్స్‌ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన బాలిక ప్రపంచ స్థాయిలో భారత్ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉందన్నారు. జెస్సీ రాజ్ లాంటి ప్రతిభ గల క్రీడాకారిణిలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా సహాయ,సహకారాలను అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

లోకేశ్ ప్రజాదర్బార్​లో వెల్లువెత్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం - Nara Lokesh Praja Darbar

Lokesh Praja Darbar Receives Resounding Response : ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేశ్​ చేపట్టిన ‘ప్రజాదర్బార్’ మంగళగిరి ప్రజలకు సాంత్వన కలిగిస్తోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన వారికి ఆయన భరోసా కల్పిస్తున్న తీరు జనాల దృష్టిని ఆకర్షిస్తుంది. నాలుగు రోజులుగా నిర్వహింస్తున్న ఈ ప్రజాదర్బార్‌కు ప్రజలతో పాటు పలువురు ఉద్యోగులు, మీ సేవ నిర్వాహకులు సైతం వచ్చారు.

Last Updated : Jun 19, 2024, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details