ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సాక్ష్యాల చెరిపివేతలో ఆరితేరారు- సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం జగన్​ బ్యాచ్​ కుట్రే' - Gottipati On Madanapalle Issue - GOTTIPATI ON MADANAPALLE ISSUE

Minister Gottipati Ravi about Madanapalle Sub Collector office Issue : సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. చేసిన పాపాలు తుడిచిపెట్టేందుకే వైఎస్సార్సీపీ నేతలు వరుస కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నేరాలు చేసి సాక్ష్యాల చెరిపివేతలో వైఎస్సార్సీపీ నేతలు ఆరితేరారన్నారని ధ్వజమెత్తారు.

minister_gottipati_ravi_about_madanapalle_sub_collector_office_issue
minister_gottipati_ravi_about_madanapalle_sub_collector_office_issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 12:58 PM IST

Minister Gottipati Ravi about Madanapalle Sub Collector office Issue :మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాలు దహనానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. చేసిన పాపాలు తుడిచిపెట్టుకునేెందుకు వైఎస్సార్సీపీ నేతలు వరుస కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో వైఎస్సార్సీపీ ఆరితేరిన పార్టీ అని అందరికీ తెలుసని ధ్వజమెత్తారు.

అధికారంలో ఉండగా నెల్లూరు కోర్టులోనే దస్త్రాలు దొంగతనం చేయించారని ఆరోపించారు. అధికారం పోయాక యనమలకుదురు కరకట్టపై దస్త్రాలు తగలపెడుతుంటే ప్రజలే వెంబడించి పట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు పెద్దిరెడ్డి పాపాలు మాయం చేసేందుకే దస్త్రాలు తగల పెట్టించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆరోపించారు. సాక్ష్యాలు మాయం కేసులకు సంబంధించి జరుగుతున్న వరుస ఘటనలన్నింటిలో వైఎస్సార్సీపీ కుట్రలు బహిర్గతమవుతున్నాయన్నారు.

Madanapalle Fire Accident Case Updates :చేసిన పాపాల నుంచు జగన్​ అతని బ్యాచ్ తప్పించుకోలేరని తెలిపారు. నేరస్థులు ఎంతటివారైనా వదిలేది లేదని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించే ప్రభుత్వం తమదని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. దీంతో రంగంలోకి దిగిన డీజీపీ ద్వారకా తిరుమల సహా పోలీసు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడం ప్రమాదమా? లేదా కుట్రపూరితమా అనే కోణం లో విచారణ జరుపుతూ ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించాలని చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన మదనపల్లికి చేరుకుని విచారణ చేపట్టారు.

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయం దహనం వెనక పెద్దిరెడ్డి పాత్ర! - Madanapalle Sub Collector Office

Files Burn : అగ్నిప్రమాదం కుట్ర వెనక మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆయనకు సంబంధించిన కీలకమైన భూదస్త్రాలు మాయం చేసేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రెవెన్యూశాఖ మంత్రి అనగాని మండిపడ్డారు. పెద్దిరెడ్డి భార్య భూ మార్పిడి కోసం దరఖాస్తు చేశారని, ఇప్పుడు ఈ పత్రాలు బయటపడతాయన్న భయంతోనే కార్యాలయం తగులబెట్టించారన్నారు.

మదనపల్లె అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ - దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసుశాఖ - Madanapalle Fire Accident Case

ABOUT THE AUTHOR

...view details