Minister BC Janarthan Reddy on Green Field Airports Proposals:రాష్ట్రంలో మరో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని - అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదన ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీని, కార్గో సేవలను పెంచడం ద్వారా ప్రయాణికులకు మరింత విస్తృతంగా సేవలు అందించాలన్న ఆలోచన సాకారం అవుతుందని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపామని అన్నారు.
దీంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదిత ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తగిన భూమి గుర్తించి, నివేదికలు అందించాలని ప్రభుత్వాన్ని కోరిందని మంత్రి అన్నారు. దీనికి సంబంధించి కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జున సాగర్లో 1670 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాలు, శ్రీకాకుళంలో 1383 ఎకరాలు, తుని – అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు ఎయిర్ పోర్టు అభివృద్ధికి తగిన భూమి అందుబాటులో ఉన్నట్లు కలెకర్ట్ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఎయిర్ పోర్టుల అభివృద్ధికి గుర్తించిన భూమిలో అధ్యయనానికి ప్రాథమికంగా 9 అంశాలకు సంబంధించి ఒక సాంకేతిక కమిటీ అక్కడ అధ్యయనం చేయనుందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ