ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 10:09 PM IST

ETV Bharat / state

హైదరాబాద్ మెట్రో రైళ్లకు వర్షాల ఎఫెక్ట్ - నిలిచిపోయిన పలు రైళ్లు - Metro Trains Stopped Due to Technical Issue

Metro Trains Stopped Due to Technical Issue : హైదరాబాద్‌లోని మెట్రో రైలు రాకపోకల్లో అంతరాయం కలిగింది. మియాపూర్ - ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ఆగిపోయినట్లు మెట్రో పైలెట్లు ప్రకటించారు. భాగ్యనగరంలో భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్లు కిక్కిరిసి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఎండీ కేవీబీ.రెడ్డి స్పందించారు. వెంటనే సమస్యను పరిష్కారిస్తామని పేర్కొన్నారు.

Metro Trains Stopped Due to Technical Issue
Metro Trains Stopped Due to Technical Issue (ETV Bharat)

Metro Trains Stopped Due to Technical Issue: హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం, ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్- ఎల్బీనగర్ కారిడార్​లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. పంజాగుట్ట, ఎర్రమంజిల్ స్టేషన్లలో కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు. సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకో పైలట్లు ప్రకటించారు. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అంతేకాకుండా ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటికి వచ్చారు.

Hyderabad Metro Trains Issue : భాగ్యనగరలో భారీ వర్షం, రహదారిలో ట్రాఫిక్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఇది గమనించిన మెట్రో సిబ్బంది హుటాహుటినా ఆ మార్గంలో ఫ్రీక్వెన్సీ పెంచారు. నిమిషానికి రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కారణంగా ఓ రైలులో తలెత్తిన సాంకేతిక సమస్యతో మిగతా రైళ్లన్నీ నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కో స్టేషన్​లో 5 నుంచి 10 నిమిషాలు ఆపేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్​ మెట్రో స్టేషన్​లో ఎగ్జిట్​ మిషన్లు మొరాయించాయి. దీంతో ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు మార్గం లేనందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయటకి వెళ్లేందుకు తీవ్ర జాప్యంతో కొంత మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం - రాబోయే 4 రోజులు పాటు వర్షాలు కురుస్తాయన్న అధికారులు - Rain Effect in AP

Metro Employees Respond on Metro Trains Stop : మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యపై ఎండీ కేవీబీ.రెడ్డి స్పందించారు. రైళ్ల రాకపోకలు ఆగిపోయిన 7 నిమిషాల్లో పునరుద్ధిరించామని, మియాపూర్​ స్టేషన్​ దగ్గర కనెక్టవిటీ చేశామని తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మెట్రో రైలు అధికారులు వివరించారు. నగరంలో భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చాలా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. మెట్రోలో వెళితే త్వరగా వెళ్లొచ్చని భావించిన ప్రయాణికులకి సాంకేతిక సమస్యలతో మెట్రో సర్వీసులు నిలిచిపోవడం సమస్యగా మారింది.

ఈ రెండ్రోజులు వర్షాలతో జాగ్రత్త!- విపత్తుల సంస్థ సూచన - RAIN ALERT IN ANDHRA PRADESH

ABOUT THE AUTHOR

...view details