Masthan Sai Case Updates :న్యూడ్ ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి కేసులో ఇప్పటివరకు యువతులు, పలువురి వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన అధికారి ఓ యువతితో ఉన్న చిత్రాలు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఆ యువతే ఆర్‌జే శేఖర్ బాషాతోనూ కలిసి ఉంది. ఆ ఫొటోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో నటుడు నిఖిల్ కూడా ఉన్నాడు.
బయటపడిన పోలీసు అధికారి ఫొటోలు :తనపై హత్యాయత్నం చేశాడని మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని ఫిబ్రవరి 3న అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కేవలం యువతుల చిత్రాలు, ఆడియో కాల్స్ వరకే పరిమితమైనట్లు అంతా భావించారు. ఈ క్రమంలో పోలీసు అధికారి ఫొటోలు రావడం కలకలం రేపుతోంది. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాలో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేశారని సమాచారం.
ఆ అధికారితో అప్పట్లో ఓ యువతి చేసిన ఛాటింగ్‌లు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ కేసు విషయంలో ఆ యువతి 2022లో ఆయణ్ని కలిసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి కొన్నాళ్లు ఛాటింగ్, వీడియో కాల్స్ నడిచినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె ఆ అధికారి తనను మోసం చేశాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో సహాయం చేస్తానని శేఖర్ బాషా ఆ యువతికి హామీ ఇచ్చి పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీడియోలు బయటకొచ్చాయి.