Fire Accident At Mallapur Industrial Estate :తెలంగాణలోనినాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంసన్ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. రాంసన్ గోదాం పక్కకు ఆనుకొని ఉన్న తిరుమల వుడ్ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఏదో చోట అగ్నిప్రమాదాలు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
'పెయింట్లకు సంబంధించిన గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని మాకు సమాచారమందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాము. అగ్నిప్రమాదం ఏవిధంగా జరిగిందనేది దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు"-చక్రపాణి, ఏసీపీ