ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడవి పంది వేట - మరో వివాదంలో మోహన్‌బాబు కుటుంబం! - MANCHU MOHANBABU CASE

జల్​పల్లి నివాసంలో అడవి పందిని వేటాడిన విష్ణు సిబ్బంది - సామాజిక మాధ్యమాల్లో వైరల్

Another Controversy on Mohan Babu Family
Another Controversy on Mohan Babu Family (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 6:28 PM IST

Manchu Mohanbabu Family is Another Controversy :కుటుంబ అంతర్గత వివాదాలతో వీధికెక్కిన సినీనటుడు మోహన్‌బాబు కుటుంబం తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి అటవీ ప్రాంతం పక్కనే మోహన్​ బాబు నివాసానికి సమీపంలో నెమళ్లు, జింకలు సహా వన్యప్రాణులు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు మేనేజర్‌ కిరణ్‌ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అడవిపందిని వేటాడి భుజాలపై మోసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

దీనిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి చెప్పగా వన్యప్రాణులను శిక్షిస్తే అటవీ అధికారులు ఎలా ఊరుకుంటున్నారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్​, వాట్సాప్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్న దృశ్యాలు తమ దాకా వచ్చాయని పహాడీషరీఫ్‌ ఎస్​ఐ తెలిపారు. అయితే, వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహించారు.

ఇదిలా ఉండగా విలేకరిపై దాడి కేసులో మోహన్​బాబు ముందస్తు బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు కొట్టేసింది. మోహన్​బాబు ప్రస్తుతం గుండె, నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల ముందస్తు బెయిల్​ ఇవ్వాలని కోరగా అదనపు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​(ఏపీపీ) వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ ముందస్తు బెయిల్​ పిటిషన్​ను కొట్టేసింది.

ABOUT THE AUTHOR

...view details