Manchu Mohan Babu Tweet About High Court Petition : సినీ నటుడు మంచు మోహన్‌బాబు మరోసారి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించలేదంటూ పోస్టు చేశారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని మోహన్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. వాస్తవాలను మాత్రమే మీడియా ప్రచారం చేయాలని కోరారు.
ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేస్తూ తన ముందస్తు బెయిల్‌పై స్పష్టత ఇచ్చారు. ఓ ఛానల్ ప్రతినిధిపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మోహన్ బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించినట్లు ప్రచారం జరగడంతో తాజాగా మంచు మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించి వివరణ ఇచ్చారు. అవాస్తవాలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం కవరేజ్‌కి వచ్చినఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పహాడిషరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
కొట్టింది వాస్తవమే - ఏ సందర్భంలో జరిగిందో ఆలోచించాలి: మోహన్‌బాబు