Mohan Babu Discharged from Hospital : ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన మంచు మోహన్‌బాబు డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన మోహన్‌బాబుకు రెండు రోజులపాటు చికిత్స అందించారు. చికిత్స తర్వాత గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు.
ఇదీ జరిగింది:కాగా హైదరాబాద్‌లోని జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణ అనంతరం సినీనటుడు మోహన్‌బాబు హాస్పిటల్‌లో చేరారు. అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అనంతరం బుధవారం ఉదయం మోహన్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
బుధవారం విడుదల చేసి హెల్త్ బులిటెన్‌లో మోహన్‌బాబుకు బీపీ ఎక్కువగా ఉండి అధిక నొప్పులతో హాస్పిటల్‌లో చేరారని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయనకు కొన్ని గాయాలతోపాటు కంటి కింద వాపుగా ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల చికిత్స అనంతరం మోహన్ బాబును నేడు డిశ్చార్జ్ చేశారు.