Manchu Manoj Comments on Manchu Family Dispute :మంచు కుటుంబంలో జరుగుతోన్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో ఆయన నివాసంలో చర్చలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని జల్‌పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు, మధ్య చర్చలు జరిగన జరిగాయి. సోమవారం పెద్ద మనుషుల సమక్షంలో మోహన్‌బాబు, మనోజ్ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నేడు విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో ఈ ముగ్గురూ చర్చలు జరిపారు. చర్చల అనంతరం కుటుంబ వివాదంపై మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు.
పోలీసులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? : తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో తాను పోరాటం చేయడం లేదని, తాను చేసేది ఆత్మగౌరవ పోరాటమని, ఇది తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని మంచు మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికి భార్య, పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు. తన భార్యను బెదిరింపులకు చేస్తున్నారని, తన 7 నెలల పాపను దీనిలోకి లాగడం, తన పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.
మంచు కుటుంబంలో రచ్చ రచ్చ - అర్ధరాత్రి వారిని ట్యాగ్ చేస్తూ మనోజ్ ట్వీట్
పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానని గుర్తు చేశారు. తనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తామనే వారు తన మనుషులను బెదరగొట్టి వేరే వాళ్లని లోపలికి పంపించారని ఆరోపించారు. తన మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు. తనకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తానని ఆయన వెల్లడించారు.