ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా భద్రత గురించి భయంగా ఉంది - మంచు మనోజ్‌పై పోలీసులకు మోహన్‌బాబు ఫిర్యాదు - MOHAN BABU VS MANOJ

కొన్ని రోజులుగా తండ్రీకొడుకుల మధ్య వివాదాలు - తనపై దాడి చేశారని ఇప్పటికే పోలీసులకు మనోజ్​ ఫిర్యాదు

Manch Mohanbabu Vs Manch Majoj
Manch Mohanbabu Vs Manch Majoj (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 9:27 PM IST

Updated : Dec 9, 2024, 10:51 PM IST

Mohan Babu Complaint To Rachakonda Police On his Son Manoj : తన చిన్న కుమారుడు మంచు మనోజ్‌పై తండ్రి మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్, అతని భార్య మౌనికల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

తాను రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నానని తెలిపిన మోహన్​బాబు, 4 నెలల క్రితం మనోజ్ ఇంటిని విడిచి వెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తరువాత సంఘవ్యతిరేకులతో కలిసి తన ఇంటివద్ద మనోజ్‌ హడావిడి చేశాడని వెల్లడించారు. తన కార్యాలయంలోకి 30 మంది చొరబడి సిబ్బందిని బెదిరించారని వివరించారు. మనోజ్, మౌనిక తన ఇంటిని ఆక్రమించి, సిబ్బందిని బెదిరిస్తున్నారని మోహన్​బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రాణహాని కలిగిస్తున్నారు : తన భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల గురించి భయంగా ఉందని వెల్లడించారు. తనకు హాని కలిగించే ఉద్దేశంతో మనోజ్, మౌనిక ఉన్నారన్నారు. తన ఇంటిని శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. సంఘవిద్రోహులుగా మారి ఇంట్లో వారికి ప్రాణహాని కలిగిస్తున్నారని వివరించారు. తన ఇల్లు స్వాధీనానికి మనోజ్, మౌనిక ప్లాన్ చేశారని తెలిపారు. మనోజ్ దంపతులు, వారి సహచరులపై చర్యలు తీసుకోవాలన్నారు. తన భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని కోరారు. భయం లేకుండా ఇంట్లో గడిపేందుకు రక్షణ కల్పించాలని మోహన్​బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Hero Manchu Manoj Joined Hospital : అయితే సినీ హీరో మంచు మనోజ్​ కాలికి గాయం కావడంతో ఆయన ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వెళ్లారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు మనోజ్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో హీరో మంచు మనోజ్‌ వెంట ఆయన భార్య మౌనిక కూడా ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మీడియా ఆ ఆస్పత్రికి వెళ్లి మనోజ్‌ దంపతులను ప్రశ్నించగా వారు స్పందించలేదు. ఆ సమయంలో నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ హిరో మనోజ్‌ ఆస్పత్రి వెళ్తున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్​ మారింది.

'నా పేరును రాజకీయంగా ఉపయోగించవద్దు' - మోహన్ బాబు వార్నింగ్

మెగా - మంచు ఫ్యామిలీ వివాదం - ఇన్నాళ్లకు ఓపెన్ అయిన మంచు మనోజ్​ - Chiranjeevi Mohan Babu

Last Updated : Dec 9, 2024, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details