మల్లన్న సాగర్ నిర్వాసితుల కష్టాలు Mallanna Sagar Residents Problems: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయ నిర్మాణం కోసం 14 గ్రామాల ప్రజలను గత ప్రభుత్వం ఖాళీ చేయించింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆనాటి ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. భూమితో పాటు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇస్తామని వెల్లడించారు. ఒంటరి మహిళల ఏడున్నర లక్షల నగదు, ఇంటి స్థలం లేదా ఇళ్లు కట్టిస్తామంటూ ప్యాకేజీ ప్రకటించారు. దాదాపు మూడేళ్లవుతున్నా వారికి పూర్తిస్థాయిలో తమ ప్యాకేజీలు, ఇళ్లు అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దయనీయంగా మారిన ముంపు బాధితుల బతుకులు - కొత్త ప్రభుత్వంపైనే కోటి ఆశలు
Beedi industry workers Problems : మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఒకటైన లక్ష్మాపూర్‌లో "దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్(Desai Brothers Ltd)" పేరుతో బీడీ పరిశ్రమ ఉండేది. దీని ద్వారా దాదాపు 150 మంది మహిళలు ఉపాధి పొందేవారు. గ్రామం ఖాళీ చేసే సమయంలో పరిశ్రమ సైతం తరలివచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీల్లో బీడీ పరిశ్రమకు(Beedi Industry) సరైన సౌకర్యాలు కల్పించకపోవటంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ముడిసరుకు దాచుకునేందుకు సరైన గదులు లేక బీడీ ఆకు పాడైపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథకు నీటి విడుదల
Beedi industry Loss Employment : మరోవైపు తమ స్వగ్రామంలో బీడీలతో పాటు సాగు పనులు చేసుకోవడం ద్వారా ఇల్లు గడిచేదని తెలిపారు. పునరావాస కాలనీలో పనులు లేక మగవాళ్లు సైతం ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోయారు. బీడీల ద్వారా రోజుకు కేవలం 200 నుంచి 300 రాబడి ఏ మాత్రం సరిపోవట్లేదని వెల్లడిస్తున్నారు. కూలీ ధర పెంచి తమను ఆదుకోవాలని కంపెనీని, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.బీడీలు చుట్టడానికి కావాల్సిన కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి కేటాయిస్తే మహిళలకు మరింత ఆదాయం చేకూర్చే అవకాశం ఉంటుందని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. కార్యాలయం లేకపోవటంతో ఇళ్లల్లో బీడీలు చుట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం... మల్లన్నను తాకిన గోదారమ్మ..
"మా భర్తకు పని ఏమి లేదు. ఇళ్లు గడవడానికి ఈ బీడీలపైనే ఆధారపడుతున్నాం. రోజుకు 200 కంటే ఎక్కువగా రావడం లేదు. మల్లన్న సాగర్ ప్యాకేజీ ఏమిరాలేదు. అక్కడ ఉన్నప్పుడు వ్యవసాయ పనులు చేసుకునే బతికేవాళ్లం. ఇప్పుడు అలాంటిది ఏమిలేక ఇబ్బంది పడుతున్నాం."- బాధితురాలు
Mallanna Sagar Dam: అంతా ఒకచోట చేరి పనిచేస్తే ఉత్పాదకత పెరిగి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కార్యాలయ ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హమీలను పూర్తిగా అమలు చేయలేదు. ఇస్తానన్న ప్యాకేజీలు అందకపోవటంతో ఇళ్ల నిర్మాణానికి అప్పులు తెచ్చుకొని పూర్తి చేస్తున్నారు. మరో వైపు చేసుకుందామంటే పనులు దొరకట్లేదు. ప్రభుత్వం స్పందించి తమ కష్టాలకు పరిష్కార మార్గాన్ని చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Ponnala On CM KCR : 'మల్లన్నసాగర్‌ను అంకితమిచ్చింది జాతికి కాదు.. కల్వకుంట్ల కుటుంబానికి'