ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - SRISAILAM BRAHMOSTAVAM CELEBRATION

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం-అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడి, భక్తులకు దర్శనంతో పాటు తాత్కాలిక వసతి, పార్కింగ్ ప్రదేశాలు, ఉచిత అన్నప్రసాదం

SRISAILAM MAHASHIVRATRI BRAHMOSTAVAMS CELEBRATION
SRISAILAM MAHASHIVRATRI BRAHMOSTAVAMS CELEBRATION (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2025, 5:05 PM IST

Srisailam Brahmostavams 2025:ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా ఆలయాన్ని అలంకరించారు. యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో దంపతులు, అర్చకులు ప్రారంభ పూజలను నిర్వహించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు దర్శనం, తాత్కాలిక వసతి, పార్కింగ్ ప్రదేశాలు, ఉచిత అన్నప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీరు, గణేష్ సదన్ ఎదురుగా మినీ కల్యాణకట్ట ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి సత్రాల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details