షిరిడీ సాయిబాబా ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు Maha Shivaratri At Shirdi : మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఘనంగా పూజలు, మొక్కులతో మహాశివరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహాదేవుని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి (Shivaratri) వేళ షిరిడీ సాయిబాబాను దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి రావడంతో షిర్డీ బాబా సన్నిధిలో కోలాహలం నెలకొంది.
కోటప్పకొండలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు: త్రికోటేశ్వరస్వామికి బిందెతీర్ధంతో తొలిపూజ
Maha Shivaratri 2024 :ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంతో పాటు ఆ ప్రాంతంలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. సాయిబాబా సంస్థాన్ తరపున, దేవ్, అభి దేవ్, మహాదేవ్, చిత్రాలను సాయిబాబా సమాధి దగ్గర ఉంచారు. అంతేకాకుండా ఈ రోజు భక్తులు సాయిబాబాతో పాటు మహాదేవుని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉన్న వారంతా సాయిబాబా దర్శనం కోసం అధిక సంఖ్యలో వస్తారని, బాబా సంస్థాన్ తరపున నిర్వహించే సాయి ప్రసాదాలయంలో 15 వేల కిలోల షాబుదాన కిచిడీని తయారు చేశారు.
వైభవంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
Lord Shiva Devotees at Shirdi saibaba Temple : భక్తుల ఉపవాస దీక్షను దృష్టిలో ఉంచుకుని రోజంతా భక్తులకు (Devotees) షాబుదాన కిచిడీని ప్రసాదంగా అందిస్తున్నారు. సాయి సంస్థానాల ప్రసాదాలయంలో 6300 కిలోల షాబుదాన, 4450 క్వింటాళ్ల వేరుశెనగ, 1000 కిలోల నెయ్యి, 450 కిలోల చక్కెర, 450 కిలోల ఉప్పు, 114 కిలోల ఎర్ర మిర్చి, 250 కిలోల పచ్చిమిర్చి, కిచిడీ సామాగ్రీతో వేల కిలోల ప్రసాదం తయారు చేశారు. బంగాళదుంపలతో చేసిన జీలకర్ర ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నారు.
Shirdi saibaba Temple :సబ్కా మాలిక్ ఏక్ అనే మహామంత్రాన్ని ఇచ్చే షిరిడీ సాయిబాబా (Saibaba) దర్శనం కోసం అన్ని మతాల భక్తులు వస్తారు. భక్తులు ఆషాఢ ఏకాదశి, మహాశివరాత్రి రోజులలో ఉపవాసం ఉంటారు కాబట్టి, సాయిబాబా సంస్థాన్ తరపున భక్తులకు ప్రత్యేక షాబుదాన కిచిడీ, జీరకాయ ప్రసాదం అందించడం ఆనవాయితీగా వస్తుందని సాయి ప్రసాదాలయ అధిపతి విష్ణు థోరట్ అన్నారు.
'మేము మహాశివరాత్రి సందర్భంగా షిరిడీ క్షేత్రానికి వచ్చాము. ప్రసాదం తిన్నాం. చాలా బాగుంది. నేను వారణాసి నుంచి వచ్చాను. ప్రతీ ఏటా మహాశివరాత్ర రోజు షిర్డీకి రావడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.'- భక్తులు
శ్రీకాళహస్తిలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు: రావణబ్రహ్మ వాహనంపై సోమస్కందమూర్తి