ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు - సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు - Madanapalle One Town CI Sent to VR - MADANAPALLE ONE TOWN CI SENT TO VR

Madanapalle One Town CI Sent to VR : మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదనపల్లె ఒకటో పట్టణ సీఐ వలిబసు విధులు సరిగా నిర్వహించలేదని గుర్తించిన అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

madanapalle_one_town_ci_sent_to_vr
madanapalle_one_town_ci_sent_to_vr (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 2:25 PM IST

Updated : Jul 24, 2024, 6:49 PM IST

Madanapalle One Town CI Sent to VR : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దస్త్రాల దహనం ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మదనపల్లె ఆర్డీఓ (RDO)గా గతంలో పని చేసిన మురళి, బదిలీ అయిన హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను పోలీసులు వరుసగా మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి ఫైళ్లు తగలబడిన సమయంలో కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. ఈ ఘటనలో ప్రాథమిక విచారణలో బాధ్యులుగా చేర్చిన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మదనపల్లె ఒకటో పట్టణ సీఐ (CI) వలిబసుపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ వలిబసును వీఆర్​ (VR) కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి అధికార బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. కీలక పాత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Last Updated : Jul 24, 2024, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details