Weather Update in AP: రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, N.T.R. మూడూ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయన్నారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాలు కోలుకుంటుండగా వాతావరణ శాఖ ప్రకటన ఆందోళనకు గురి చేస్తోంది. ఈసారి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.