Lokesh Election Campaigning in Tadepalli : తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి అనే మాట లేకుండా చేస్తామని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులతో నారా లోకేశ్ సమావేశమయ్యారు. తాగునీరు, మురుగు కాలువల సమస్య ఎక్కువగా ఉందని అపార్ట్మెంట్ వాసులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఉన్నా శాంతి భద్రతలు అదుపులో లేవని లోకేశ్ ఆరోపించారు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోతుందన్నారు. రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలని నారా లోకేశ్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కేజీ నుంచి పీజీ స్థాయి వరకు విద్యా విధానాలలో నూతన పద్ధతులను తీసుకొస్తామన్నారు.
వైసీపీ భూ బకాసురులతో పోరాడలేక నిండు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది: చంద్రబాబు - Chandrababu on Family Suicide
రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలబెట్టడమే తమ ధ్యేయమని చెప్పారు. ఐరోపా దేశాలలో ఉచితంగా విద్య, వైద్య విధానాన్ని చక్కగా అమలు చేస్తున్నారని, అదే పద్ధతిని మన రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామన్నారు. ప్రజలు కట్టిన పన్నులకు వారు పొందుతున్న వసతులకు మధ్య వ్యత్యాసం ఉందని, దీనిని తగ్గించాల్సి ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే గంజాయి లేకుండా చేస్తాం: నారా లోకేశ్ "తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి అనే మాట లేకుండా చేస్తాం. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఏపీని అభివృద్ధి చేస్తాం. బోధనా పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తాం. ముఖ్యమంత్రి నివాసం కూతవేటు దూరంలోనే ఉన్నా మంగళగిరిలో శాంతి భద్రతలు అదుపులో లేవు. సీఎం నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవు. తాగునీరు, మురుగు కాలువల సమస్యలపై పట్టించుకున్న పాపానపోలేదు." -నారా లోకేశ్, టీడీపీ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి
Police Checking Nara Lokesh Convoy: కాగా అంతకుముందు ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. తాడేపల్లిలో ప్రచారానికి వెళ్తున్న లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి వాహనాల్లో సోదాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక లోకేశ్ ప్రచారానికి వెళ్తున్న ప్రతిసారి ఆయన కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా తనిఖీలు చేపట్టగా వాహనం దిగి లోకేశ్ పోలీసులకు సహకరించారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు.
రెండు నెలల్లో అమరావతి పనులు ప్రారంభిస్తాం - నారా లోకేశ్ - Nara Lokesh Rachabanda Program