Lokesh Election Campaign in Tadepalli : ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సి వాసులతో నారా లోకేశ్ సమావేశం అయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మైనింగ్ విభాగంపై మొదటి విచారణ కమిటీ వేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని మండిపడ్డారు. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అక్రమ మధ్య నియంత్రణ పాలసీని తీసుకొస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని లోకేశ్ చెప్పారు.
సీఎం జగన్ (CM Jagan) రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్‌తో పాటు భాస్కర్ అవార్డు కూడా వస్తుందని లోకేశ్ ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపై వేసిన మహానటుడు జగన్ అని లోకేశ్ ఆరోపించారు.
నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత - కేంద్ర హోం శాఖ నిర్ణయం - Z Category Security to Lokesh
Nara Lokesh Breakfast Meet in Thadepally :తాడేపల్లిలో అపార్ట్మెంట్ వాసులతో లోకేశ్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత (Z category security) కల్పించిన విషయం తెలిసిందే. లోకేశ్‌కు సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించినందున వారు లోకేశ్‌కు భద్రతగా వచ్చారు.