Liquor Bottles Seized at Grama Ward Sachivalayam: జగన్ సర్కార్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలు సైతం అరాచకాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిళాలు ఎరవేస్తున్నారు. వైసీపీ నేతలు తమ అరాచకాలకు ప్రభుత్వ కార్యాలయాలను సైతం వదలట్లేదు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సచివాలయంలో మద్యం బాటిళ్ల పట్టివేత ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ మున్సిపల్ అధికారులు 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంపై గ్రామ సచివాలయాల నిర్వహణపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో అధికార వైఎస్సార్సీపీపై ప్రతిపక్షాల విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
325 మద్యం సీసాలు స్కానింగ్ - ఎస్ఈబీ అధికారులకు చిక్కిన అధికారి - illegal liquor seized
వివరాల్లోకి వెళ్తే: కావలిలోని 17వ వార్డు బుడంగుంట సచివాలయంలోమద్యం బాటిళ్లు ఉన్నట్లు సి.విజిల్ యాప్ ద్వారా గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. సచివాలయం తాళంచెవులపై సరైన సమాచారం లభించకపోవడంతో, అధికారులు తలుపులు బద్దలు కొట్టి అందులో ఉన్న 43 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు అదే సచివాలయంలోనే నిల్వ చేసి ఉన్న రేషన్ బియ్యం వెలుగులోకి రావడంతో అధికారులు అవాక్కైయ్యారు.