Lecturer Brutally Beat Students in Nandyala District :అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగును నింపేవారే టీచర్. అలాంటి టీచర్‌కు పురాణాలు సైతం పెద్దపీట వేశాయి. పిల్లలు తప్పు చేస్తే ఓ అమ్మలాగా, నాన్నలాగా దండించే హక్కు టీచర్‌కు ఉంది. విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ భావిభారత పౌరులుగా తయారు చేస్తారు. వారి భవిష్యత్తు బాగుపడాలని నిరంతరం శ్రమిస్తారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే మందలిస్తారు. అంతే కానీ ఒక మృగంలా మారి విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
డోన్ పట్టణంలోని శ్రీ సుధా జూనియర్ కళాశాలలో బీ దేవేంద్ర అనే వ్యక్తి మ్యాథ్స్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తాజాగా తాను పిల్లలకు లెక్కలు చెప్తు, బోర్డుపై రాశారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ గ్రూప్ క్లాస్ రూమ్‌లోకి వెళ్లి బోర్డుపైన మ్యాథ్స్ ప్రాబ్లం రాసి దానిని విద్యార్థులు సాల్వ్ చేయాలని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థిని పిలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు ప్రాబ్లం సాల్వ్ చేయడం రాక బోర్డ్ దగ్గరే నిలబడి పోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లెక్చరర్ విద్యార్థులను జుట్టు పట్టుకొని కిందికి లాగి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో విద్యార్థుల శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.