ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ - రహస్యంగా వీడియోలు తీసి మరీ - LAW STUDENT GANGRAPED IN VIZAG

నమ్మించి వంచించిన ప్రియుడు - రహస్యంగా వీడియోలు తీసి.. ఆపై స్నేహితులతో కలిసి అఘాయిత్యం - తీవ్రమనస్తాపంతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం

Law Students Gang Raped On Friend Girlfriend In Visakhapatnam
Law Students Gang Raped On Friend Girlfriend In Visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 6:50 AM IST

Law Students Gang Raped On Friend Girlfriend In Visakhapatnam :ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై ఓ యువతిని నమ్మించిన యువకుడు ఆమెను బలవంతంగా అనుభవించడమే కాక స్నేహితులతో కలిసి అత్యాచారం చేసిన దారుణ ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలిని కాపాడిన ఆమె తండ్రి న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ - రహస్యంగా వీడియోలు తీసి మరీ (ETV Bharat)

ఒక్కొక్కరుగా అత్యాచారం : విశాఖలో ముగ్గురు విద్యార్థులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరానికి చెందిన ఓ యువతికి సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13న వంశీ ఆ యువతిని ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీశ్ గదిలోకి వచ్చి ఆమెను బెదిరించారు. తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా ఒకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు.

ప్రాణాలతో ఉందో? లేదో? తెలియకుండానే అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

ఉరివేసుకుని ఆత్మహత్యయత్నం : ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో బాధితురాలు నిలదీసింది. ఆ తర్వాత అతను యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించింది. కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది. మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్లు చేయాలనడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని చనిపోయేందుకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను కాపాడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగుర్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండ : విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

"అత్తా కోడళ్లపై అత్యాచారం" - నిందితుడిపై 37కేసులు - ప్రత్యేక కోర్టు విచారణ : హోంమంత్రి అనిత

ఫ్రెండ్​ను కొట్టి యువతిపై గ్యాంగ్​ రేప్- నిందితుల కోసం 10పోలీస్ టీమ్స్​ హంట్! - Woman Gang Raped In Pune

ABOUT THE AUTHOR

...view details