Amaravati Drone Summit 2024 :డ్రోన్ల వినియోగం సర్వసాధారణమైపోయింది. వైద్యం, నిఘా, వ్యవసాయం, ట్రాఫిక్, విపత్తు నిర్వహణ. ఇలా విభిన్నరంగాల్లో అదే హవా. వీటి ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించాలని సంకల్పించారు.. విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థులు. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన డ్రోన్లు రూపొందించి 'భళా' అనిపించారు. ఏఐ జతచేసి వారు తయారుచేసిన సరికొత్త డ్రోన్లు ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
యువత డ్రోన్ల తయారీలో భాగమవ్వాలని కొన్ని కళాశాలల్లో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ల్యాబ్ అందుబాటులోకి రావడంతో ఇంతవరకూ మార్కెట్లోకి అందుబాటులోకి రాని ఆధునిక డ్రోన్లు రూపకల్పన చేశారీ విద్యార్థులు. పలు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రదర్శించి బహుమతులు, ప్రశంసలూ దక్కించుకున్నారు. విజయవాడ ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్నారు ఈ విద్యార్థులు.
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయం!
కళాశాలలో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ అందుబాటులోకి రావడంతో డ్రోన్ తయారీపై ఆసక్తి పెంచుకున్నారు. ద్రోణాచార్య టెక్ హబ్ సహకారంతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో 60 మంది శిక్షణ పొందారు. నిపుణులే ఆశ్చర్యపోయేలా తక్కువ సమయంలోనే అధునాతన పరిజ్ఞానంతో డ్రోన్లు రూపొందిస్తున్నారు. విధుల్లో భాగంగా హై ఓల్టేజీ విద్యుత్ ప్రవహించే లైన్లపై మరమ్మతులు చేస్తుంటారు లైన్‌మెన్లు. అలా పనిచేస్తూ తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు 17వేల రూపాయల ఖర్చుతోనే డ్రోన్ తయారు చేసింది జితిన్ బృందం. దాని పని తీరును ఇలా వివరిస్తున్నారు.
భారీ వరదలు సంభవించినపుడు డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించడం చూసే ఉంటాం. మనిషి పర్యవేక్షణ లేకుండా యూఏఈ ఆపరేషన్స్ పేరిట వారం రోజుల్లోనే డ్రోన్ చేశారు ఈ విద్యార్థులు. ప్రకృతి విపత్తులు, వ్యవసాయం, ట్రాఫిక్ వంటి చోట్ల జీపీఎస్‌తో ఎలా పని చేస్తుందో ఇలా వివరిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మోడ్రన్ అటానమస్ డ్రోన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అనే సరికొత్త డ్రోన్ ఆవిష్కరించారీ విద్యార్థులు.