ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రికి ఫ్యాన్​లు తెచ్చుకుంటున్న రోగులు - చికిత్స కోసం వెళ్లి నానా అవస్థలు - Ongole Rims Hospital

Lack of Facilities in Ongole Rims Hospital : ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో వసతుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐసీయూ గదుల్లో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులే ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చికిత్స కోసం వెళ్లి అవస్థలు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ongole Rims Hospital
Ongole Rims Hospital (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 10:21 AM IST

Lack of Facilities in Ongole Rims Hospital :వైద్యం కోసం ఆ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలంటే టేబుల్‌ ఫ్యాన్‌ వెంట తీసుకెళ్లాల్సిందే. సరైన వసతులు లేక రోగులు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్యులూ అందుబాటులో ఉండటం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి దుస్థితి.

వసతుల కొరతతో రోగులకు తీవ్ర ఇబ్బందులు :ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం నిత్యం వందల మంది వస్తుంటారు. అలాంటి ఆస్పత్రిలో పేషంట్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోగులకు సరైన వైద్యం, సౌకర్యాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. గత పది రోజులు నుంచి ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయకపోయినా ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు. చేసేది లేక ఇంటి వద్ద నుంచి కొందరు టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. ఫ్యాన్లు లేని వారు విసన కర్రలపై ఆధారపడుతున్నారు.

ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital

సరైన వైద్యం అందటంలేదు :డాక్టర్లు సరైన వైద్యం అందించడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు. వైద్యం అందకు కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వసతులు లేకపోవటమే ప్రధాన లోపమంటూ ఓ రోగి ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రికి సుస్తీ - Maharaja Sarvajana Hospital

చికిత్స కోసం వెళ్లి అవస్థలు :జూనియర్ డాక్టర్ల ఆందోళనతో పేషెంట్లకు వైద్య సేవలకు ఆటంకం ఏర్పడిందని రోగులు చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన స్పందన లేదని వాపోయారు. ఆస్పత్రిలో తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణ సరైన రీతిలో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగుల బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలూ పని చేయని పరిస్థితి నెలకొంది. నిధుల కొరత వల్లే రిమ్స్‌ ఆస్పత్రి నిర్వహణను అధికారులు గాలికివదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎమర్జెన్సీ వార్డుల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఇంటి వద్ద నుంచి ఫ్యాన్లు తెచ్చుకుంటున్నాం. ఆసుపత్రికి వైద్యులు కూడా సరిగా రావడం లేదు. జూనియర్​ డాక్టర్లు మాత్రమే రోగులను చూసుకుంటున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వారు కూడా సరిగా స్పందించడం లేదు -రోగి బంధువు,ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి

గిల్టు నగలు, చీరలు కావాలా - కడప ప్రభుత్వాస్పత్రికి వెళ్దాం పదండి - HOSPITAL STAFF PRIVATE BUSINESS

ABOUT THE AUTHOR

...view details