ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫాంహౌస్‌ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన 'ఏ2' - పోలీసుల ప్రశ్నలు ఇవే!

జన్వాడ ఫాంహౌస్‌ కేసులో ముగిసిన విజయ్‌ మద్దూరు విచారణ - నాలుగు గంటలపాటు విచారించిన పోలీసులు

Janwada_Farm_House_Case
Janwada Farm House Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 4:22 PM IST

KTR Brother in Law Farm House Case: తెలంగాణలోని జన్వాడ ఫామ్ హౌస్​ పార్టీ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. మోకిలా పోలీసుల ఎదుట ఈ కేసులో ఏ2గా ఉన్న విజయ్ మద్దూరి హాజరయ్యారు. కొన్ని రోజులుగా విచారణకు హాజరుకాని విజయ్ మద్దూరి బుధవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జన్వాడ ఫామ్ హౌస్​ కేసులో ఏ1గా ఉన్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్​పాకాల ఉన్న విషయం తెలిసిందే. రాజ్​పాకాలకు విజయ్ స్నేహితుడు. ఫామ్​ హౌస్​లో జరిగిన​ పార్టీలో పాల్గొన్న విజయ్​ మద్దూరి సాంపిల్స్‌ను పరీక్షించగా ఆయన డ్రగ్స్​ తీసుకున్నట్లు తేలింది. దీంతో విజయ్​ మద్దూరిని పోలీసులు ఈ వ్యవహారంలో ప్రశ్నించారు.

పోలీసుల ప్రశ్నలు ఇవే :పార్టీలో మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారు అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నిసార్లు మాదకద్రవ్యాలు తీసుకున్నారు అనే కోణంలోనూ పోలీసులు విజయ్​ మద్దూరిని ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపుగా నాలుగు గంటల పాటు విజయ్‌ మద్దూరిని పోలీసులు విచారించారు. గతంలో రాజ్‌ పాకాల ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన పలు సమాధానాల ఆధారంగా కూడా విజయ్‌ మద్దూరికి పోలీసులు పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

సుమారు 4 గంటల విచారణ అనంతరం మోకిల పోలీస్‌ స్టేషన్‌ నుంచి విజయ్‌ మద్దూరి వెళ్లిపోయారు. రాజ్ పాకాల ఫామ్​ హౌస్​లో జరిగిన లిక్కర్ పార్టీలో విజయ్​ మద్దూరికి టెస్ట్ చేయగా, డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. జన్వాడ ఫామ్​ హౌస్​ లిక్కర్​ పార్టీ కేసు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర చర్చలకు దారితీసింది.

జన్వాడ ఫామ్‌హౌస్‌ మద్యం పార్టీ కేసు - విచారణకు హాజరైన రాజ్​ పాకాల

ABOUT THE AUTHOR

...view details