Karimnagar Residents set up Saboon Banners to Prevent Monkeys :ఆ కాలనీలో కోతుల సమస్య ఎక్కువ. ఎటు చూసినా అవే. ఏమైనా పనులు చేసుకోవాలన్నా, బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలన్నా కోతులు ఎక్కడ మీదకు ఎగబడతాయోనని ఆ కాలని వాసులు భయం భయంగా ఉంటున్నారు. ఇంటి బయట ఏమైనా పెడదామంటే వాటిని ఏం చేస్తాయో అని సందిగ్ధం. అసలు వాటి ఏమీ చేయలేము, అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదు.
దీంతో వాళ్లంతా ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. కోతులను కొట్టకూడదు, అవి ఇంట్లోకి రాకుడదు అలానే ఇంటి గేటు ముందుకు వచ్చాయంటే భయపడి వెళ్లిపోవాలి. ఇలా ఏం చేస్తే బాగుంటుంది అనుకుని వారు ఒక పని చేశారు. అంతే ఆ కాలనీలో ఏ ఇంటికీ కోతులు రావడం లేదు. ఒకవేళ వచ్చినా భయపడి వెళ్లిపోతున్నాయి. అలా అవి రాకుండా వారు ఏం చేశారంటే.
తెలంగాణలోని కరీంనగర్ వాసవి నగర్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో ఏదైనా పట్టుకుని వెళ్తే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇంటి బయట ఏమైనా పెడితే ఇక దాని గురించి మర్చిపోవాల్సిందే. వాటిని ఏమీ అనలేరు, కొట్టలేరు. ఇంక ఏమీ చేయాలో తెలీక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి అనుకున్నారు.