ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్​ సందీప్​ మెహతా, నటుడు గోపిచంద్​ - Actor Gopichand Visited Tirumala

Justice Sandeep Mehta and Actor Gopichand Visited Tirumala : కలియుగవాసుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సందీప్ మెహతా, సినీ నటుడు గోపిచంద్​ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

tirumala_visit
tirumala_visit

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 7:04 PM IST

Justice Sandeep Mehta and Actor Gopichand Visited Tirumala :తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, సినీ నటుడు గోపీచంద్ లు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు వేరువేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి హుండీల్లో కానుకలు సమర్పించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పండితుల ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్​ సందీప్​ మెహతా, నటుడు గోపిచంద్​

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు - తెల్లవారుజాము నుంచే బారులు తీరిన ప్రజలు

స్వామి వారి సేవలో భీమా చిత్రబృందం:ఇటీవల కాలంలో గోపిచంద్​ నటించిన సినిమా రిలీజ్​ సందర్భంగా శ్రీవారిని 'భీమా' చిత్రబృందం దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం బాగా జరిగిందని గోపిచంద్​ తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నామని పేర్కొన్నారు. తను నటించిన 'భీమా' సినిమా పెద్ద హిట్​ అవుతుందని గట్టి నమ్మకం ఉందని పేర్కొన్నారు. భీమా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన గోపిచంద్​ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడితో ఒక సెల్పీ దిగడానికి ఉత్సాహం చూపారు.

శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ - వేద పండితుల ఆశీర్వచనం

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 57,880 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 19,772 మంది అని పేర్కొన్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు అని తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details