JEE Main Results: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా బాలికల కేటరిగిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ సత్తా చాటింది. 100 పర్సంటైల్ సాధించిన ఏకైక బాలికగా సాయి మనోజ్ఞ నిలించింది. దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వంద పర్సంటైల్ రాగా వారిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తి కొండ, తెలంగాణ నుంచి బని బ్రాత మాజీ 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు - ఏపీ బాలికకు వంద పర్సంటైల్ - JEE MAIN RESULTS 2025
14 మందికి వంద పర్సంటైల్ - 100 పర్సంటైల్ సాధించిన మనోజ్ఞ గుత్తికొండ
![జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు - ఏపీ బాలికకు వంద పర్సంటైల్ Sai Manogna 100 percentile](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/1200-675-23522004-thumbnail-16x9-jee-results.jpg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2025, 6:30 PM IST
|Updated : Feb 11, 2025, 7:54 PM IST
రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఐదుగురు వంద పర్సంటైల్ సాధించారు. జనరల్ EWS కేటగిరిలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99 పర్సంటైల్ సాధించి మొదటి స్థానంలో నిలిచారు. పరీక్షా సమయంలో అక్రమాలకు పాల్పడిన 39మంది ఫలితాలను ప్రకటించలేదని NTA ప్రకటించింది. జనవరి 22 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్ మొదటి సెషన్ కి 13.11లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 12.58లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
'ఇష్టంతో కష్టపడటం వల్లే సాధ్యమైంది' - జేఈఈ టాపర్ గుత్తికొండ సాయి మనోజ్ఞ