Jana Sena Prudhvi Raj Ad Viral on Social Media : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం రోజురోజుకూ పదునెక్కుతోంది. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కావడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Jana Sena)పార్టీ రూపొందించిన ఓ టీజర్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"భూమి నీదే.. రాత్రికి రాత్రే మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం.. అయితే ఏంటి.. భూమి నీదైతే నిరూపించుకో?’ అంటూ వైసీపీ నేతలు తెగబడితే ఏ రైతు అయినా ఏం చేయగలరు.. కోర్టులకు వెళ్లే అవకాశం లేకపోతే వారికి న్యాయం ఎక్కడ లభిస్తుంది..?" అనే ఇతివృత్తంతో ఈ టీజర్‌ను రూపొందించింది జనసేన. అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్లో.. 'ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో.. అన్నదాతల తలరాతలు ఎలా మారబోతున్నాయో, రాత్రికి రాత్రే భూముల్ని ఎలా కొట్టేస్తారో' అనే అంశాన్ని వివరించారు.
"ఎంత అధికారం మీదైతే మాత్రం రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా?" అని సామాన్య పౌరుడు ప్రశ్నిస్తే.. "నిజమే.. అయితే నువ్వేం చేయగలవు" అని ఎదురుదాడి చేసే ప్రజాప్రతినిధి తీరు.. అధికార దురాగతాలకు అద్దం పడుతోంది. ఇందులో ప్రజాప్రతినిధి పాత్రలో సినీ యాక్టర్ పృథ్వీ నటించారు. "చెమటలు పడుతున్నాయా.. ఫ్యాన్ వేయమంటావా?" అని పృథ్వీ అడిగితే.."ఐదేళ్లు వేసింది చాలయ్యా" అని సామాన్యుడి పాత్రధారి సాగనంపే రీతిలో సమాధానమిస్తారు. అప్పుడు "ఇలాంటి వారిని మనమేమీ చేయలేమా" అని ఆవేదన వ్యక్తం చేసే సామాన్యుడి కుమార్తె ప్రశ్నకు.. ఓటుతోనే సమాధానం చెప్పగలమనే సందేశాన్ని ఇచ్చారు.
'ఆయ్ అండీ, గాలి మారిందండీ' ఇదీ గోదావరి జిల్లాల ఓటర్ మనోగతం - AP Elections 2024