ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ సర్కార్ ఎంఐజీ ప్లాట్లతో పాట్లు- కూటమి రాకతో లబ్ధిదారుల్లో సంతోషం - MIG Layout No Facilities

MIG Layout No Facilities: మధ్యతరగతి కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లను సాధారణ ధరకే అందిస్తామంటూ గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్‌లు ప్రవేశపెట్టింది. అన్ని రకాల మౌలిక వసతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఊదరగొట్టారు నాటి ముఖ్యమంత్రి జగన్. ఆ లేఅవుట్‌లలో సౌకర్యాలు లేకపోగా, ప్లాట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి.

MIG Layout No Facilities
MIG Layout No Facilities (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 4:17 PM IST

MIG Layout No Facilities: రాష్ట్రంలో మొదటగా నెల్లూరు జిల్లా కందుకూరులో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ (ఎంఐజీ) పథకానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం. మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పుచెరువు ప్రాంతం సర్వేనెంబర్ 297-3ఏ2, 297-బీ2, 3సీలో 26.13 ఎకరాలు అధికారులు గుర్తించారు. 292 ప్లాట్లతో లేఅవుట్‌ సిద్ధం చేశారు. నుడా ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మౌలిక సదుపాయాల కోసం 13 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కానీ మూడేళ్లలో అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. 200 గజాల స్థలానికి నిర్ణయించిన ధర ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. సదుపాయలు పూర్తిచేయకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 38 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. డబ్బులు కట్టిన లబ్ధిదారులు కొందరు తిరిగి తీసుకున్నారు. మరికొందరికి డబ్బులు చెల్లించలేదు.

జగనన్న లేఔట్‌ లబ్ధిదారుల ఆందోళన- దారిలేని స్థలాల కేటాయింపుపై మండిపాటు

మూడేళ్లలో అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. మురుగుపారుదల వ్యవస్థ లేదు. తాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయలేదు. గార్డెన్ అభివృద్ధి పనులు జరగలేదు. లేఅవుట్‌లో పిచ్చిచెట్లు మొలిచాయి. ప్రజాధనం దుర్వినియోగం చేశారు. చదును చేయడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రజాధనాన్ని వైఎస్సార్సీపీ నాయకులు దుర్వినియోగం చేసి వారి జేబులు నింపుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

కందుకూరు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఎక్కువ ధరకు లేఅవుట్ ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతంలో ఎంఐజీ (Middle Income Group) లేఅవుట్ వేశారని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి ఈ లేఅవుట్ నిదర్శనమని ఎమ్మెల్యే ఇంటూరి చెప్పారు. లబ్దిదారులను మోసం చేయడానికి ఎక్కువ ధరలు పెట్టారని అన్నారు. ఈ లేఅవుట్​కు స్పందన లేదని అధికారులు విమర్శించారు.

పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోన్న జగనన్న లేఅవుట్

టీడీపీ ప్రభుత్వం రావడంతో 10 శాతం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. స్థలం విలువ తగ్గించి, మౌలిక సదుపాయలు ఏర్పాటు చేస్తే కొనుగోలు చేస్తామని స్థానికులు అంటున్నారు. మరోవైపు ధరలు తగ్గించే ఆలోచన ఉందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

"2022లో మధ్యతరగతి వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్లాటు సుమారుగా 17 లక్షల రూపాయలు చెప్పారు. అయితే మేము లక్షా 71 వేలు అడ్వాన్స్​గా కట్టారు. నిర్ణయించిన ధర చాలా ఎక్కువగా ఉండటం, పట్టణానికి చాలా దూరంగా ఉండటంతో పాటు సౌకర్యాలు ఏవీ కల్పించకపోవడం వలన ప్లాట్లు ఆశించిన స్థాయిలో బుక్ అవ్వలేదు. దీంతో దాని నుంచి బయటపడాలని కొంతమంది రీఫండ్ కోసం దరఖాస్తు చేశారు". - లబ్ధిదారులు

మధ్య తరగతికి జగనన్న స్మార్ట్‌ మోసం - అమరావతిలో ప్లాట్లు కొన్నవారికి కష్టాలు - Amaravati Township

ABOUT THE AUTHOR

...view details