ETV Bharat / state

మన ఇంట్లో దృశ్యాలు అతని సెల్​ఫోన్​లో లైవ్​! ఎలాగో తెలిస్తే షాక్​ - CCTV CAMERAS MISUSED

సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే సంస్థలో టెక్నీషియన్‌ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని బరితెగింపు

CCTV_CAMERAS_MISUSED
CCTV_CAMERAS_MISUSED (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 8:50 AM IST

Technician Employee Misused CCTV Cameras in Guntur : సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే సంస్థలో టెక్నీషియన్‌ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సీసీ ఫుటేజీల యాక్సెస్‌ పొందుతున్నారన్న ఫిర్యాదులపై శేషు అనే వ్యక్తితో పాటు ఓ టీవీ ఛానెల్‌ కెమెరామన్‌ వంశీ, ఓ దినపత్రిక విలేకరి అరుణ్‌లపై గుంటూరు పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కెమెరామెన్‌ వంశీని విచారణకు పిలిచిన పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు.

గుంటూరుకు చెందిన శేషు సీసీ కెమెరాలు (CCTV) ఏర్పాటు చేసే సంస్థలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆర్డర్ల మేరకు ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఫామ్​హోస్​, బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగిస్తుంటారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం వాటి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వంటివి సంబంధిత వివరాలను యజమానులకే ఇచ్చేసి, వారికే యాక్సెస్‌ ఇవ్వాలి. కానీ శేషు మాత్రం అందుకు విరుద్ధంగా ఆయా సీసీ ఫుటేజీల్లో (CCTV footage) నిక్షిప్తమయ్యే దృశ్యాల యాక్సెస్‌ను తన దగ్గర కూడా పెట్టుకున్నారు. తన ఫోన్‌లో ఆయా దృశ్యాల్ని చూస్తూ వారి వ్యక్తి గత గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఫుటేజీలను అడ్డం పెట్టుకుని, ఇతరులతో కలిసి బెదిరింపులకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

నిద్రపోతున్న 'నిఘా'నేత్రం - ఎలా చిక్కేను సాక్ష్యం!

ఇలా బయటపడింది : ఇటీవల అరండల్‌పేట పోలీసు స్టేషన్‌ లోపల రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు దిండు, పడక ఏర్పాటు ఆయన మేనల్లుడైన మైనర్‌ బాలుడిని స్టేషన్‌ లోపలికి అనుమతించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోలీసుల స్టేషన్‌ లోపల ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై విచారించగా శేషు పాత్ర బయటపడింది. అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన శేఘ ఆ దృశ్యాల యాక్సెస్‌ను తన వద్ద పెట్టుకున్నట్లు తేలింది. శేఘనే వాటిని కెమెరామన్‌ వంశీ ద్వారా పత్రికా విలేకరి అరుణ్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఓ విశ్రాంత ఆర్‌ఎస్సైకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రం, ఓ స్పా కేంద్రంలో ఏర్పాటు చేసినవి సహా మరో 13 చోట్ల సీసీ కెమెరాల యాక్సెస్‌ పొందాడు. అక్కడి దృశ్యాలను శేషు తన మొబైల్‌లో చూస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్​ అధికారులు తెలియజేశారు.

నిఘా నీడలో రాజధాని - రియల్‌టైం గవర్నెన్స్ అమలుకు ప్రభుత్వం సిద్ధం

గుంటూరు జిల్లాలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు - చోద్యం చూస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.