ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి ఎద్దడితో వరి రైతుల అవస్థలు - పట్టించుకోని అధికారులు - కాకినాడ జిల్లా రైతుల కష్టాలు

Irrigation Water Problems in Kakinada District : గోదావరి డెల్టా శివారు ప్రాంతాల్లో రబీలో వరి పంట వేసిన రైతులను సాగు నీటి ఎద్దడి తీవ్రంగా వేధిస్తోంది. ఆయకట్టుకు నీరందక వరి చేలు నెర్రెలు బారుతున్నాయి. వరి తొలి దశలోనే పంటలు కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో వరి నాట్లు ఎండిపోవడంతో సాగుదారుల పరిస్థితి దయనీయంగా మారింది.

irrigation_water_problems_in_kakinada_district
irrigation_water_problems_in_kakinada_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 8:01 PM IST

నీటి ఎద్దడితో వరి రైతుల అవస్థలు- పట్టించుకోని అధికారులు

Irrigation Water Problems in Kakinada District :ఖరీఫ్‌లో పచ్చని పంటలతో కళకళలాడే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రబీ వచ్చిందంటే చాలు వరి సాగుకు నీటి కటకట మొదలవుతుంది. ఆయకట్టు శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని పత్తిగొంది, గ్రాంటు గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో వరి పంట ఎండిపోతోంది. పొలాలు నెర్రెలు ఇచ్చి బీటలు వారుతున్నాయి. దాళ్వలో అధిక శాతం ఎదజల్లు విధానంలో వరి పంట సాగు చేస్తున్నారు. 22 రోజులుగా నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. నీళ్లు ఇస్తామని చెప్పిన అధికారులు ముఖం చాటేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి - జగన్​ మాయ మాటలతో రైతులకు తప్పని వెతలు

Drought Conditions to Pady :తాళ్లరేవు మండలంలో గోదావరి నుంచి వచ్చే నీరే పంటలకు ఆధారం. ఆయకట్టు రైతులు గొర్రిపూడి ప్రధాన పంట కాల్వలో నీటిని ఎత్తిపోతల ద్వారా శివారు భూములకు తరలిస్తారు. ఎత్తిపోతల పథకం, కాల్వల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల కోసం దాళ్వలో ఎకరానికి 2 వేల చొప్పున రైతులు కేటాయిస్తారు. అయినా నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. ఎదజల్లిన వరి సాగుకు సకాలంలో నీరు అందడం లేదు. పంట కాలవల్లో జలవనరుల శాఖ అధికారులు పూడిక తీయించక రైతులే ఆ పనులు చేసుకుంటున్నారు. మోటార్లతో నీరు తోడుకుంటున్నారు. నీరు అందని పొలాలు ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

సాగునీటి కష్టాలను ఎదుర్కోంటోన్న రాయలసీమ- కరువు ప్రభావం ఎలా ఉంది

'పత్తిగొందిలోనూ తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. సకాలంలో రెండో పంట ప్రారంభించినా నీరు అందకపోవడంతో నీటి కోసం సాగుదారులం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. అయినా లాభం లేదు. రైతులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.' -బాధితరైతులు

'ప్లీజ్ ఒక్క తడి' ! పంటకు నీరందక రైతుల కంట తడి

Farmers Problems due To Irrigation Problem : ఎన్నో కష్టాలు పడి పంట సాగు చేస్తే నీరందించలేక పంట నాశనంమవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మా గోస ఎన్నిమార్లు విన్న వించుకున్నా ఫలితం లేకుండా పోయింది. తాళ్లరేవు మండలంలో చొల్లంగి, చిన్నబొడ్డు వెంకటాయపాలెం, సీతారాంపురం, చిన్నవలసలు గ్రామాల్లోనూ సాగునీటి కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మాయదారి రోగం - లబోదిబోమంటున్న మిర్చి రైతులు

ABOUT THE AUTHOR

...view details