తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేను ప్రేమించిన అమ్మాయితోనే మాట్లాడతావా..' ఇంటర్​ విద్యార్థిపై ప్రేమోన్మాది దాడి - YOUNG BOYS ATTACKED ON ASTUDENT

అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్‌ విద్యార్థిపై దాష్టీకం - నలుగురు యువకుల దౌర్జన్యం - వీడియో తీసి మరి సోషల్​ మీడియాలో పోస్ట్

YOUNG BOYS ATTACKED ON ASTUDENT
ఓ ఇంటర్​ విద్యార్థిపై నలుగురు యువకుల దాడి (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 2:27 PM IST

Four Youngers Attacked Student in AP : తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్‌ విద్యార్థిపై కోపం పెంచుకున్నాడు. తనతో పాటు ముగ్గురు స్నేహితులతో కలిసి తీవ్రమైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి నిందితులు పైశాచిక ఆనందం పొందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంలో ఈ దారుణమైన ఉదంతం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన ప్రకారం తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడినందుకు ఏఎఫ్‌డీటీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిపై ఓ యువకుడు విపరీతమైన పగ పెంచుకున్నాడు. తన స్నేహితులు మరో ముగ్గురితో కలిసి బాధితుడిని ఈ నెల నవంబర్​ 5న స్థానిక సినిమా హాలు వెనుక స్థలంలోకి తీసుకుపోయారు. అందరూ ఒక్కసారిగా యువకుడిపై పిడిగుద్దులు గుద్దారు.

చెట్టుకు కట్టిమరి వికృత చేష్టలతో రెచ్చిపోయారు. చొక్కాను మెడకు బిగించి పైశాచిక చర్యలతో ఆనందం పొందారు. ఇంకో యువకుడు ఇష్టారీతిన ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నాడు. మెడలో ఉన్న గొలుసును బిగించడంతో గొంతు భాగంలో తీవ్ర గాయమైంది. బాధితుడు తనను ఏమీ చేయొద్దని వేడుకున్నా ఆ నలుగురు యువకులు కొంచెం కూడా కనికరించలేదు.

నిందితులు అదే కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతూ మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఫోన్‌లో వీడియో తీసి ఈ నెల (నవంబర్) 19న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయడంతో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. దాడికి పాల్పడినవారు, బాధిత విద్యార్థి మైనర్లే కావడం గమనార్హం. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగలోకి రాగానే ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తపేట డీఎస్పీ గోవిందరావు, రాజోలు సీఐ టి.వి.నరేశ్‌కుమార్‌ బుధవారం (నవంబరు 20) తెలిపారు. బాధితుడి తండ్రి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తిరుపతిలో 'ప్రేమ​ కథా చిత్రం' యువకుడిపై కత్తితో దాడి - స్కెచ్ ఎవరిదంటే! - Attack on Student in Tirupati

వాలీబాల్‌ ఆటలో గొడవ - నడిరోడ్డుపై ఓ యువకునిపై పదిమంది దాడి - MAN WAS BEATED IN NALGONDA VIDEO

ABOUT THE AUTHOR

...view details