ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుధవారం ఐఎన్​ఎస్​ నిర్దేశక్​ నౌక జాతికి అంకితం - INS NIRDESHAK SHIP TO NATION

హైడ్రో గ్రాఫిక్ సర్వేలకోసం నిర్దేశక్ నౌక - అత్యాధునిక పరికరాలతో కోల్​కత్తాలో నిర్మాణం

INS Nirdeshak Ship to Nation
INS Nirdeshak Ship to Nation (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2024, 10:48 PM IST

Updated : Dec 17, 2024, 10:55 PM IST

INS Nirdeshak Ship to Nation:నౌకాదళం హైడ్రో గ్రాఫిక్ సర్వేల కోసం ఉద్దేశించిన INS నిర్దేశక్ నౌకను బుధవారం జాతికి అంకితం చేయనున్నారు. విశాఖ నావెల్ డాక్ యార్డ్​లో జరగనున్న ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ పాల్గొని నిర్దేశక్ నౌకను జాతికి అంకితమిస్తారు. కోల్​కత్తాలోని జీఆర్ఎస్ఈలో దేశీయంగా 80 శాతం పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన ఈ నౌకను రెండు ఇంజిన్లతో రూపకల్పన చేశారు.

అత్యాధునిక పరికరాలతో నిర్దేశక్ నౌక: అత్యాధునిక హైడ్రో గ్రాఫిక్, ఓషనో గ్రాఫిక్ సర్వే పరికరాలతో ఈ నిర్దేశక్​ను తీర్చిదిద్దారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబంధించిన రెండో నౌక ఇదే కావడం గమనార్హం. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి 2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ స్ధానంలో ఈ కొత్త నౌక రూపుదిద్దుకుంది. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకత.

నౌకాసంపత్తిని పెంచుకునేందుకు:హిందూ మహా సముద్ర పరిసర ప్రాంతాల్లో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం కోసం హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్దేశక్ నౌక చేపడుతుంది. స్నేహపూర్వకంగా ఉన్న దేశాల నౌకాదళాలతో సైతం అవసరమైన మేరకు సమాచారం కూడా పంచుకుంటుంది. భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ సంధాయక్ తర్వాత ఈ నిర్దేశక్ నౌక హైడ్రో గ్రాఫిక్ సర్వే సమాచారం కోసం వినియోగంలోకి రానుంది. ఈ తరహా నౌకా సంపత్తి ఉన్నదేశాల కంటే ధీటుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడనుంది.

Last Updated : Dec 17, 2024, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details