ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE UPDATES: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు- జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు - Independence Day celebrations in AP - INDEPENDENCE DAY CELEBRATIONS IN AP

Independence_Day_Celebrations_http://10.10.50.85:6060/finalout4/andhra-pradesh-nle/thumbnail/15-August-2024/22209802_thumbnail_16x9_independence_day_celebrations_in_ap_live_updates1.jpgin_AP_Live_Updates
Independence_Day_Celebrations_in_AP_Live_Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 8:22 AM IST

Updated : Aug 15, 2024, 11:42 AM IST

Independence Day Celebrations in AP Live Updates: రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

LIVE FEED

11:37 AM, 15 Aug 2024 (IST)

గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

రాష్ట్రంలో ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన నుంచి స్వతంత్రం లభించటమే 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేకత అన్నారు టీడీపీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో వారు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు లేని విషయం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు రూ.5కే ఆహారం అందించి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. పేదరికం లేని సమాజం చూడాలన్న చంద్రబాబు ఆశయాల మేరకు పని చేస్తున్నట్లు తెలిపారు.

11:36 AM, 15 Aug 2024 (IST)

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఆరిమిల్లి రాధాకృష్ణ

ఎందరో సమరయోధుల త్యాగాలు ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో ఆయన పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

11:19 AM, 15 Aug 2024 (IST)

ఐఎన్‌ఎస్‌ సర్కార్ పరేడ్ మైదానంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

విశాఖలో తూర్పు నౌకదళం, పోర్టు ట్రస్ట్‌ భద్రతా విభాగాల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం ఐఎన్​ఎస్ సర్కార్ పరేడ్ మైదానంలో నిర్వహిచిన వేడుకల్లో తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్‌ పాల్గొన్నారు. జాతీయ పతాకానికి వందనం సమర్పించిన తూర్పు నౌకాదళ అధిపతికి నావికాదళం గౌరవ వందనం సమర్పించింది. భారత ఆర్థిక పురోభివృద్ధిలో మహాసముద్రాలపై శాంతి కాపాడడం చాలా కీలకమని, ఇందులో భారత నౌకాదళం అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుందని వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ అన్నారు. అసమాన శక్తి సామర్ధ్యాలు, ఆత్మస్థైర్యం, త్యాగం, సేవాభావం భారత నౌక దళానికి ఎంతో ప్రత్యేకతను తీసుకువచ్చాయని చెప్పారు. విశాఖ పోర్ట్ స్టేడియంలో పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ అంగముత్తు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పోర్ట్ ట్రస్ట్ భద్రతా విభాగం, సీఐఎస్​ఎఫ్​ దళం అంగముత్తుకు గౌరవ వందన సమర్పించారు. అనంతరం విశాఖ పోర్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Independence_Day_Celebrations_in_AP_Live_Updates (ETV Bharat)

11:08 AM, 15 Aug 2024 (IST)

పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌

స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ మురళీకృష్ణతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సత్యసాయి జిల్లా పోలీస్ పరేడ్‌ మైదానంలో జరిగిన వేడుకల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనకాపల్లిలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో హోంమంత్రి అనిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అందరి సహకారంతో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. శ్రీకాకుళంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి వారికి ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

11:03 AM, 15 Aug 2024 (IST)

సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన సభా ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఎగరవేశారు. శాసన మండలి ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు పాల్గొన్నారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ వద్ద వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ జెండాను ఎగరవేశారు. సచివాలయం, అసెంబ్లీ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో చిన్నారులను ప్రభుత్వం తొలిసారిగా అనుమతించింది.

10:57 AM, 15 Aug 2024 (IST)

78వ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత జెండాను ఎగురవేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జెండాను ఆవిష్కరించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం, కర్నూలులో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి.

10:51 AM, 15 Aug 2024 (IST)

కాకినాడలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌

అప్పట్లో బ్రిటిష్‌ వారిని, వర్తమానంలో నియంతలను.. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిమి కొట్టారని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకుల్లో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జెండా పండుగ సందర్భంగా పంచాయతీ రాజ్‌ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు పెంచినట్లు వెల్లడించారు.

Independence_Day_Celebrations_in_AP_Live_Updates (ETV Bharat)

10:48 AM, 15 Aug 2024 (IST)

నెల్లూరులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • నెల్లూరు: వెంకటాచలం అక్షర విద్యాలయంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు
  • దేశంలో 18 శాతంమంది ఇంకా ఆకలితో అలమటిస్తున్నారు: వెంకయ్యనాయుడు
  • దేశంలో కులమతాలకు అతీతంగా అందరూ గౌరవంగా బతకాలి: వెంకయ్యనాయుడు
  • ప్రకృతితో మమేకమై జీవించాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • రాబోయే తరాలకు ప్రకృతి విలువను తెలియజేయాలి: మాజీ ఉపరాష్ట్రపతి
  • పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంచాలి: వెంకయ్యనాయుడు

10:46 AM, 15 Aug 2024 (IST)

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన పురందేశ్వరి

  • విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
  • జాతీయ జెండా ఎగురవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
  • ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: పురందేశ్వరి
  • వికసిత ఏపీ కోసం మనమంతా కలిసి పని‌చేయాలి: పురందేశ్వరి
  • ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ వారధి కార్యక్రమం ప్రారంభించింది: పురందేశ్వరి
  • నేటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు: పురందేశ్వరి

10:44 AM, 15 Aug 2024 (IST)

గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తాం: సీఎం చంద్రబాబు

  • రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్ధిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నాం: సీఎం చంద్రబాబు
  • నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • దేవుడి దయ వల్ల సాగునీటి ప్రాజెక్టులకు జులైలోనే జలకళ వచ్చింది: సీఎం చంద్రబాబు
  • కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి: సీఎం చంద్రబాబు
  • సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తాం: సీఎం చంద్రబాబు
  • రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం: సీఎం చంద్రబాబు
  • వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం మా ప్రభుత్వ విధానం: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తాం: సీఎం చంద్రబాబు
  • కేంద్రంతో సంప్రదింపులు జరిపి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తాం: సీఎం చంద్రబాబు

10:21 AM, 15 Aug 2024 (IST)

ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు: సీఎం చంద్రబాబు

  • విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్రం, తెలంగాణతో చర్చించి ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
  • వికసిత్‌ భారత్‌ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ సిద్ధంగా ఉంది: సీఎం చంద్రబాబు
  • సైబరాబాద్‌ నిర్మాణంలో నాలెడ్జ్‌ ఎకానమీతో సంపద సృష్టించాం: సీఎం చంద్రబాబు
  • విజన్‌ 2020 అనేది ముందుగానే పూర్తిస్థాయి ఫలితాలు ఇచ్చింది: సీఎం చంద్రబాబు
  • నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతోంది: సీఎం చంద్రబాబు
  • ఉమ్మడి రాష్ట్రంలో మేం తెచ్చిన పాలసీలే అందుకు కారణం: సీఎం చంద్రబాబు
  • ప్రపంచంతో పోటీపడే నగరంగా హైదరాబాద్‌ ఆవిష్కృతం వెనుక మన అప్పటి విధానాలే: సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగస్వాములు: సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్‌ సిక్స్‌తో 6 హామీలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు
  • ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు: సీఎం చంద్రబాబు
  • రాష్ట్ర పరిస్థితిపై ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం: సీఎం చంద్రబాబు
  • పోలవరం, అమరావతి రాజధాని, విద్యుత్ వంటి శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం: సీఎం చంద్రబాబు
  • సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం: సీఎం చంద్రబాబు
  • తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు
  • నాటి అక్రమాలపై లోతైన దర్యాపు చేయిస్తాం: సీఎం చంద్రబాబు
  • అక్రమార్కులను శిక్షించి తీరుతాం: సీఎం చంద్రబాబు
Independence_Day_Celebrations_in_AP_Live_Updates (ETV Bharat)

10:14 AM, 15 Aug 2024 (IST)

నేటినుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం: సీఎం చంద్రబాబు

  • యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు: సీఎం చంద్రబాబు
  • నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం: సీఎం చంద్రబాబు
  • నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తాం: సీఎం చంద్రబాబు
  • కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉచిత ఇసుకపై నిర్ణయం తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు: సీఎం చంద్రబాబు
  • మరింత పకడ్బందీగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం: సీఎం చంద్రబాబు
  • భూ బాధితుల కోసం మీభూమి-మీహక్కు పేరుతో రెవెన్యూ సదస్సులకు నిర్ణయం: సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
  • ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
  • పేదల సేవలో కార్యక్రమం ద్వారా పింఛన్లు పెంచి ఇంటి వద్దే ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • ఆగస్టు 1న తొలిరోజే 97 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం: సీఎం చంద్రబాబు
  • అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5కే భోజనం అందిస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను తొలగించింది: సీఎం చంద్రబాబు
  • నేటినుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • మొత్తం 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు
  • బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేశాం: సీఎం చంద్రబాబు
  • గత ఐదేళ్లలో ప్రజల కష్టాలను చూసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం: సీఎం చంద్రబాబు
  • నాడు-నేడు అని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టింది: సీఎం చంద్రబాబు
  • బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశాం: సీఎం చంద్రబాబు
  • గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయి: సీఎం చంద్రబాబు
  • పట్టాదారు పాస్‌పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు తగలేశారు: సీఎం చంద్రబాబు
  • ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు: సీఎం చంద్రబాబు
  • మొదటి కేబినెట్‌లోనే చర్చించి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దుచేశాం: సీఎం చంద్రబాబు
  • ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలన్న మా నినాదాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు: సీఎం చంద్రబాబు
  • ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించినట్లయింది: సీఎం చంద్రబాబు
  • మాపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా అధికారం పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు
  • కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు న్యాయం చేస్తాం: సీఎం చంద్రబాబు
  • సుపరిపాలనకు తొలిరోజు నుంచి కూటమి ప్రభుత్వం నాంది పలికింది: సీఎం చంద్రబాబు
  • సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం: సీఎం చంద్రబాబు
  • వంద రోజుల ప్రణాళిక లక్ష్యంగా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలను ప్రక్షాళన చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • ప్రజలకు దగ్గరగా పాలన సాగిస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • విభజన నష్టం కంటే రివర్స్‌ పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు రూ.9 లక్షల 74 వేల కోట్లకు చేరుకున్నాయి: సీఎం చంద్రబాబు
  • తలసరి ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గింది: సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వ తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది: సీఎం చంద్రబాబు
  • పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలేవీ గత ప్రభుత్వం చేయలేదు: సీఎం చంద్రబాబు
  • భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు: సీఎం చంద్రబాబు
  • ఐదేళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ఘోరంగా ఓడించారు: సీఎం చంద్రబాబు

9:49 AM, 15 Aug 2024 (IST)

నియంత పోకడలు, పరదాల పాలనతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది: సీఎం చంద్రబాబు

  • ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు విధ్వంసం సృష్టించారు: సీఎం చంద్రబాబు
  • బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: సీఎం చంద్రబాబు
  • నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు: సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారు: సీఎం చంద్రబాబు
  • ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో వేధించారు: సీఎం చంద్రబాబు
  • ప్రజావేదిక ధ్వంసంతో నాటి పాలన సాగించారు: సీఎం చంద్రబాబు
  • నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి లేదు: సీఎం చంద్రబాబు
  • లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు: సీఎం చంద్రబాబు
  • పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు
  • 10 లక్షల కోట్ల అప్పులు, అసమర్థ, అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు
  • రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం: సీఎం చంద్రబాబు
  • రాజధాని లేని రాష్ట్రమని బాధగా కూర్చోలేదు: సీఎం చంద్రబాబు
  • సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాం: సీఎం చంద్రబాబు
  • దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
  • రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం: సీఎం చంద్రబాబు
  • ప్రజల సహకారంతో 34 వేల ఎకరాలు భూసేకరణ చేశాం: సీఎం చంద్రబాబు
  • రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడూ నమ్ముతాం: సీఎం చంద్రబాబు
  • సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం: సీఎం చంద్రబాబు
  • నాడు ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు
  • పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం: సీఎం చంద్రబాబు
  • ఒక యజ్ఞం మాదిరిగా పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించాం: సీఎం చంద్రబాబు
  • 73 శాతం పనులు పూర్తిచేశాం.. మేమే కొనసాగి ఉంటే ఈపాటికే పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
  • దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాం: సీఎం చంద్రబాబు
  • 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం: సీఎం చంద్రబాబు
  • పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది: సీఎం చంద్రబాబు
  • 1956 నవంబర్‌ 1న హైదరాబాద్‌ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడింది: సీఎం చంద్రబాబు
  • 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి: సీఎం చంద్రబాబు
  • విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించాం: సీఎం చంద్రబాబు
  • నా అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడేతత్వంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నాం: సీఎం చంద్రబాబు
  • సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి వేగంగా ముందుకెళ్లాం: సీఎం చంద్రబాబు
  • దేశంలో ఎవరూ ఊహించనివిధంగా సంస్కరణలతో 13.5 శాతం వృద్ధి రేటుతో నిలిచాం: సీఎం చంద్రబాబు
  • 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం: సీఎం చంద్రబాబు
  • ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచాం: సీఎం చంద్రబాబు

9:26 AM, 15 Aug 2024 (IST)

గుంటూరు పోలీసు పరేడ్‌ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

  • గుంటూరు పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి లోకేశ్
  • ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులు, ఉద్యోగులకు పురస్కారాలు ప్రదానం
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తాం: లోకేశ్
  • సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాం: మంత్రి నారా లోకేశ్
  • రైతులకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తాం: మంత్రి లోకేశ్
  • రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు: లోకేశ్
  • పింఛన్‌ను ఒక్కసారిగా రూ.4 వేలు పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నాం: లోకేశ్
Independence_Day_Celebrations_in_AP_Live_Updates (ETV Bharat)

9:07 AM, 15 Aug 2024 (IST)

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు
  • త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన చంద్రబాబు
Independence_Day_Celebrations_in_AP_Live_Updates (ETV Bharat)

8:16 AM, 15 Aug 2024 (IST)

శాంతి, సామ‌ర‌స్యాల‌తో మెలుగుతూ మువ్వన్నెలా క‌లిసిమెలిసి ఉందాం: మంత్రి లోకేశ్

  • ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి లోకేశ్
  • ఆనందాలు నిండుగా సాగే జెండా పండ‌గ ఇది: మంత్రి లోకేశ్
  • మ‌న దేశ స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు నిద‌ర్శనం: మంత్రి లోకేశ్
  • స‌మ‌ర‌యోధుల త్యాగఫ‌లం మ‌న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు: మంత్రి లోకేశ్
  • దేశ అభివృద్ధి, ప్రజాసంక్షేమాల‌కు పాటుబడి స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుదాం: మంత్రి
  • శాంతి, సామ‌ర‌స్యాల‌తో మెలుగుతూ మువ్వన్నెలా క‌లిసిమెలిసి ఉందాం: మంత్రి

8:14 AM, 15 Aug 2024 (IST)

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జెండా ఆవిష్కరించనున్న సీఎం

  • నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకలు
  • స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
  • పతాక ఆవిష్కరణకు భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు

8:14 AM, 15 Aug 2024 (IST)

కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న పవన్

  • కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న పవన్ కల్యాణ్
  • స్వాతంత్య్ర వేడుకలకు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం
  • పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వాన పత్రిక అందించిన జీఏడీ కార్యదర్శి
Last Updated : Aug 15, 2024, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details