AP Weather Alert 2024 : ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటలకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీకి రెయిన్ అలర్ట్ - హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - Rain Alert in AP - RAIN ALERT IN AP
Rain Alert in AP : ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
![ఏపీకి రెయిన్ అలర్ట్ - హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - Rain Alert in AP Rain Alert in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-08-2024/1200-675-22290497-thumbnail-16x9-rains-in-ap.jpg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 11:00 AM IST
IMD Weather Report in AP: సోమవారం మధ్యాహ్నం వరకు తీరప్రాంతంలో అలల వేగం పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అంతర్వేది నుంచి పెరుమల్లాపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు అతివేగంతో అలలు వస్తాయని హెచ్చరించింది. నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమగోదావరి తీరప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది. హార్బర్లు, మెరైన్ కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తోన్న వర్షాలు- కొట్టుకుపోతున్న పంటలు - Rainfall in AP Today