Rain Alert in AP : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం కొనసాతుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయని వివరించింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు చేసింది.
రానున్న 36 గంటల్లో అల్పపీడనం - రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు - RAIN ALERT IN AP
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు
Rain Alert in AP (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2024, 7:57 PM IST
|Updated : Nov 9, 2024, 9:24 PM IST
Last Updated : Nov 9, 2024, 9:24 PM IST