Weapons Door Delivery in Telangana : తెలంగాణలో ఆయుధాల దందా అంగట్లో సరకులా మారుతోంది. ఓ వైపు కొందరూ ఇవి తమ దగ్గర ఉంటే హోదాగా ఉంటుందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఆధిపత్యం చెలాయిచేందుకు, పంచాయితీలకు, ప్రత్యర్థులను బెదిరించేందుకు ఉపయోగిస్తున్నారు. వీటిని ఉంచుకోవడం అక్రమమని తెలిసినా భయపడటం లేదు. దీంతో ఈ వ్యాపారం మూడు గన్లు ఆరు బుల్లెట్లుగా సాగుతోంది. ఇందుకోసం నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా దేశవాళీ తుపాకులు, పిస్టళ్లు అమ్మకానికి పెడుతున్నారు.
Gun Culture in Hyderabad :ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో, డార్క్‌నెట్‌లో వివిధ గన్ల చిత్రాలతో సహా పెట్టి అమ్మేస్తున్నారు. ఏ మోడల్ కావాలన్నా అందించేలా ఈ దందా నడుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో తమను సంప్రదించిన వారికి డోర్ డెలివరీ చేసేస్తున్నారు. ఇటీవల జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వాహనాల సోదాలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద మూడు బుల్లెట్లు, ఒక దేశవాళీ తుపాకీ దొరికాయి. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి ద్వారా వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పడంతో పోలీసులు షాక్ గురయ్యారు.
లాభదాయక వ్యాపారం : ఇతర రాష్ట్రాల్లో కొన్నప్పుడు రూ.50,000ల విలువుండే దేశవాళీ ఆయుధం, హైదరాబాద్ చేరుకునేసరికి నాలుగైదు రెట్లు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. కొందరు రౌడీషీటర్లు, భూకబ్జాలు, సెటిల్మెంట్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారని వారు చెబుతున్నారు.
విశాఖలో తుపాకుల కలకలం - ఒకరు అరెస్ట్ - police Seized two Illegal guns